Mega 157 | అఫీషియల్.. చిరు – అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్గా నయనతార
Chiranjeevi – Anil ravipudi | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవి కొత్త సినిమాను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇటీవలే 'సంక్రాంతికి వస్తున్నాం'తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడితో తన కొత్త ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టాడు.
Chiranjeevi – Anil ravipudi | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవి కొత్త సినిమాను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇటీవలే ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడితో తన కొత్త ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టాడు. మెగా 157 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ రాబోతుండగా.. గత ఉగాది పండుగ రోజున పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. చిరంజీవి ఈ చిత్రంలో తన నిజమైన పేరు శంకర్ వరప్రసాద్ పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి తాజాగా ఒక అప్డేట్ వైరల్‌గా మారింది. ఈ సినిమాలో కథానాయికగా తమిళ లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించబోతుంది. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను పంచుకుంది చిత్రబృందం. హలో మాస్టర్ కెమెరా కొంచెం రైట్ టర్న్ ఇచ్చుకొండి. సంక్రాంతికి రఫ్పాడించేద్దాం అంటూ వీడియోను విడుదల చేసింది.
ఈ సినిమా షూటింగ్‌ను మే 22 నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆ చిత్రం పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో కొత్త సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నారు. అలాగే అనిల్ రావిపూడి ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ హాఫ్ స్క్రిప్ట్‌ను వైజాగ్‌లో రాస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి నయనతారతో పాటు, క్యాథరీన్ థెరిసా నటించనున్నారని సమాచారం. అలాగే, సీనియర్ నటుడు వెంకటేష్ ఈ సినిమాలో గెస్ట్ రోల్లో కనిపించనున్నారని తెలుస్తోంది. సంగీత దర్శకుడు భీమ్స్ సెసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కానుంది.
#MEGA157 – Megastar & Nayanthara pic.twitter.com/wFjw0fOkMp
— Aakashavaani (@TheAakashavaani) May 17, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

