‘ఇండియాలో తొలి మోటోక్రాస్ ఫిల్మ్ ‘బైకర్’. చాలా కొత్తకథ. దర్శకుడు అభిలాష్ ఫ్రెష్ కంటెంట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇది హై అడ్రినలిన్, హై ఆక్టేన్ ఫిల్మ్. ఇది నాకు వినగానే నచ్చిన కథ. అందుకే రిజల్ట్ కోసం ఎక్సైట్‌గా ఉన్నాను’ అని కథానాయిక మాళవిక నాయర్ అన్నారు. శర్వానంద్‌కు జోడీగా ఆమె నటించిన చిత్రం ‘బైకర్’. డా.రాజశేఖర్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రానికి అభిలాష్‌రెడ్డి దర్శకుడు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 3న విడుదల కానుంది. మాళవిక నాయర్ బుధవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘కథకు వంతెనలాంటి పాత్రలో నేను కనిపిస్తాను. ఈ కథ మూడు కాలాల్లో సాగుతుంది. ప్రతి కాలంలోనూ నా పాత్ర ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది’ అని చెప్పింది మాళవిక నాయర్. ఇందులో తండ్రీకొడుకుల ఎమోషన్ ప్రత్యేకంగా ఉంటుందని, అద్భుతమైన ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా ఇదని మాళవిక పేర్కొన్నారు. సాంకేతికంగా అన్ని విధాలా ‘బైకర్’ ఆకట్టుకుంటుందని, ఒక్క మాటలో చెప్పాలంటే స్ఫూర్తినిచ్చే ఉత్కంఠభరిత చిత్రం ‘బైకర్’ అనీ మాళవిక నాయర్ అన్నారు.