Kriti Kharbanda | టాలీవుడ్ హీరోయిన్ రూమ్‌లో సీక్రెట్ కెమెరా.. షాక్ అయిన నటి..!
Actress Kriti Kharbanda | బోలెడంత టాలెంట్, చక్కటి రూపం, ఆకట్టుకునే నటన.. ఇలా అన్నీ ఉన్నా అదృష్టం కలిసిరాక స్టార్ హీరోయిన్ రేంజ్‌కు వెళ్లలేకపోయింది ఢిల్లీ బ్యూటీ కృతి కర్భందా. ఇక ఇదిలా ఉంటే తాజాగా కృతి గతంలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చింది.
Actress Kriti Kharbanda | బోలెడంత టాలెంట్, చక్కటి రూపం, ఆకట్టుకునే నటన.. ఇలా అన్నీ ఉన్నా అదృష్టం కలిసిరాక స్టార్ హీరోయిన్ రేంజ్‌కు వెళ్లలేకపోయింది ఢిల్లీ బ్యూటీ కృతి కర్భందా. ఇక ఇదిలా ఉంటే తాజాగా కృతి గతంలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చింది. ఓ కన్నడ మూవీ షూటింగ్ సమయంలో తాను ఉంటున్న హోటల్ రూమ్‌లో సీక్రెట్ కెమెరాను గుర్తించినట్లు కృతి చెప్పింది. ఆ హోటల్లో పనిచేస్తున్న ఓ వ్యక్తి తన గదిలో ఓ సీక్రెట్ కెమెరా పెట్టాడని చెప్పింది. మాములుగా తను ఎక్కడికి వెళ్లిన ఒకసారి రూమ్ చెక్ చేసుకోవడం తనకు, తన టీమ్‌కు అలవాటుందని.. దాంతో అలా రూమ్ ఒకసారి చెక్ చేస్తుండుగా సెటప్ బాక్స్ బ్యాక్ సైడ్ కెమెరా ఉందని గుర్తించినట్లు ఈ బ్యూటీ వెల్లడించింది.
ఆ ఘటన తనను ఎంతో భయపెట్టిందని, అప్పటి నుంచి ఎక్కడ స్టే చేసినా చాలా జాగ్రత్తగా ఉంటానని కృతి చెప్పుకొచ్చింది. పద్నాలుగేండ్ల కిందట బోణి సినిమాతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన కృతి తొలిసినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. దాంతో ఏకంగా పవన్ కళ్యాణ్ పక్కన తీన్మార్లో నటించే బంపర్ ఆఫర్ పట్టేసింది. అనురాధగా తన నటనతో అందరినీ మెప్పించింది. అయితే సినిమా పెద్దగా ఆడకపోవడంతో కృతి లైమ్‌లోకి రాలేకపోయింది. ఆ తర్వాత మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, యాక్షన్ 3డీ ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన హిట్లు కొట్టలేకపోయింది. ఇక బ్రూస్లీలో రామ్‌చరణ్ అక్కగా నటించి సైడ్ హీరోయిన్ ట్రాక్ ఎక్కేసింది. ఆ తర్వాత ఇప్పటివరకు ఈ బ్యూటీ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Party | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ ఇన్ఛార్జీల నియామకం
GST reforms | జీఎస్టీలో సంస్కరణలు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు.. వీరికి లబ్ధి
Bihar Man Kills Wife | అనుమానంతో భార్యను చంపి.. మృతదేహాన్ని కాలువలో పడేసిన భర్త
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు
Singireddy Niranjanreddy | రిజర్వాయర్లకు నీటిని తరలించి చూపిస్తాం.. మంత్రి జూపల్లి సవాల్‌ను స్వీకరిస్తున్న: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

