Athulya Ravi | కథ చెప్పగానే కనెక్ట్ అయ్యా.. తెలుగులో సినిమా చేయడంపై స్పందించిన అతుల్య రవి
Athulya Ravi | కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న సినిమా ‘మీటర్'. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చిరంజీవి (చెర్రి), హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్నారు. రమేష్ కాదూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 7న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా చిత్రంలో నటించిన అనుభవాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపింది నాయిక అతుల్య రవి.
Athulya Ravi | కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న సినిమా ‘మీటర్’. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చిరంజీవి (చెర్రి), హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్నారు. రమేష్ కాదూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 7న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా చిత్రంలో నటించిన అనుభవాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపింది నాయిక అతుల్య రవి. ఆమె మాట్లాడుతూ…‘తెలుగులో మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ ఆఫర్ వచ్చింది. దర్శకుడు రమేష్ ఫోన్లో స్క్రిప్ట్ చెప్పారు. ఆయన కథ చెబుతున్నప్పుడే ఈ సినిమాతో కనెక్ట్ అయ్యాను.
నేను ఇండిపెండెంట్ మూవీస్ చేసి ఎలా పేరు తెచ్చుకున్నానో, కిరణ్ అబ్బవరం కూడా అలాగే చిన్నస్థాయి నుంచి హీరోగా ఎదిగారు. ఆయన నటించిన ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా నన్ను ఆకట్టుకుంది. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్గా మా సినిమాకు పేరొస్తుంది. ఇందులో నా పాత్ర ఏంటన్నది సస్పెన్స్. అబ్బాయిలంటే ఆమెకు ఇష్టం ఉండదు. అయితే హీరో ప్రేమిస్తున్నానంటూ నా వెనక పడుతుంటాడు. పాటలు కలర్ఫుల్గా ఉంటాయి. ఎంటర్టైన్మెంట్తో పాటు ఫాదర్ సెంటిమెంట్ ఆకట్టుకుంటుంది. ఈ రెండు వేరియేషన్స్‌లో కిరణ్ అబ్బవరం నటన మెప్పిస్తుంది. మైత్రీ, క్లాప్ ఎంటర్టైన్మెంట్ వంటి పెద్ద సంస్థల్లో అవకాశం రావడం సంతోషంగా ఉంది. తెలుగులో అందరు హీరోల సరసన నటించాలని ఉంది. పీరియాడిక్, లవ్ స్టోరిస్ నా ఫేవరేట్ జానర్స్. తెలుగులోనే మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా. ప్రస్తుతం టాలీవుడ్లో కొన్ని ప్రాజెక్ట్స్ కోసం సంప్రదిస్తున్నారు. త్వరలో వాటి వివరాలు వెల్లడిస్తా.’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

