అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బటర్ ఫ్లై’ . ఘంటా సతీష్‌బాబు దర్శకుడు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ నెల 29న డిస్నీప్లస్ హాట్‌స్టార్ ద్వారా విడుదల కాబోతున్నది.
ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను గీత అనే పాత్రలో కనిపిస్తా. భావోద్వేగభరితమైన ప్రేమకథ ఇది. నాకు ఈ ఏడాది సెకండాఫ్ చాలా బాగుంది. కార్తికేయ-2, 18పేజెస్ సక్సెస్ అయ్యాయి. ‘బటర్ ఫ్లై’ కూడా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’ అని చెప్పింది.