Aishwarya lekshmi | పొన్నియన్ సెల్వన్‌లో తన పాత్రను తగ్గించడంపై స్పందించిన ఐశ్వర్య లక్ష్మీ
Aishwarya lekshmi | కెరీర్ ప్రారంభంలోనే మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ దూకుడుగా ముందుకు సాగుతున్నది ఐశ్వర్య లక్ష్మి. ‘పొన్నియిన్ సెల్వన్'లో ‘సముద్ర కుమారి’గా ప్రేక్షకులను అలరించిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ.. ‘మట్టి కుస్తీ’లో మల్లయోధురాలి పాత్రలోనూ మెప్పించింది.
Aishwarya lekshmi | కెరీర్ ప్రారంభంలోనే మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ దూకుడుగా ముందుకు సాగుతున్నది ఐశ్వర్య లక్ష్మి. ‘పొన్నియిన్ సెల్వన్’లో ‘సముద్ర కుమారి’గా ప్రేక్షకులను అలరించిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ.. ‘మట్టి కుస్తీ’లో మల్లయోధురాలి పాత్రలోనూ మెప్పించింది. నటిగానే కాదు, నిర్మాతగానూ రాణిస్తున్న ఐశ్వర్య లక్ష్మి కబుర్లు..
గత ఏడాది నా కెరీర్లో పెద్ద మలుపు. అంతా మంచే జరిగింది. నా ప్రతి పాత్రా ప్రేక్షకులను అలరించింది. ‘పొన్నియిన్ సెల్వన్’ వంటి చారిత్రక సినిమాలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ‘అమ్ము’ సినిమా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది.
‘అమ్ము’లో ఒక డైలాగ్ చెప్పడానికి చాలా ఇబ్బందిపడ్డాను. చాలా కష్టంగా అనిపించింది. ఆ రోజంతా ఒత్తిడికి గురయ్యాను. దాన్నుంచి బయట పడేందుకు సంగీతం విన్నాను. ఇష్టమైన
చాక్లెట్లు తిన్నాను. తమిళంలో నటించిన మొదటి రెండు సినిమాలు సరిగా ఆడకపోవడంతో కాస్త ఇబ్బందిపడ్డాను.
కథ వింటున్నప్పుడు నా పాత్ర గురించే ఆలోచిస్తా. నేను ఎంచుకునే పాత్ర ప్రేక్షకులను మెప్పించాలని కోరుకుంటా. ఆ పాత్రకు న్యాయం చేయడానికి ఎంత కష్టమైనా భరిస్తా. ‘మట్టి కుస్తీ’ షూటింగ్ సమయంలో స్టంట్స్ చేయడం ఇబ్బందిగా అనిపించేది. నిజానికి నా శరీరం కఠిన శ్రమకు సహకరించదు. అయినా పట్టు వీడకుండా ఫైట్ మాస్టర్ చెప్పింది చెప్పినట్టు ప్రాక్టీస్ చేసేదాన్ని. కాన్ఫిడెన్స్‌తో షూటింగ్లో పాల్గొనేదాన్ని. రిహార్సల్స్‌లో గాయాలు కూడా అయ్యాయి. ఆ సినిమా రివ్యూలు చదువుతున్నప్పుడు.. నేను పడిన కష్టానికి ఫలితం దక్కినట్టు అనిపించింది. నటీనటులకు ప్రశంసలే పెద్ద అవార్డులు.

రెమ్యునరేషన్ కంటే పాత్రల ఎంపికపైనే ఫోకస్ పెడతాను. పరిశ్రమను అర్థం చేసుకునేందుకు మొదట్లో, చిన్నచిన్న పాత్రలే ఎంచుకున్నా. అప్పుడే ‘అర్చన 31 నాటౌట్’ అవకాశం వచ్చింది. మూడేళ్లు ఆలోచించి మరీ ‘మట్టి కుస్తీ’ ఒప్పుకొన్నా. ప్రేక్షకుల ప్రశంసలే ఈ సినిమా చేయడానికి బలమైన కారణం.
నాకు మలయాళం తప్ప మరో భాష రాదు. తమిళం కాస్త అర్థమవుతుంది. ‘మట్టి కుస్తీ’ సమయంలో ప్రతి డైలాగ్‌కూ మలయాళంలో అర్థం చెప్పించుకునేదాన్ని. ఇందుకు కాస్త సమయం తీసుకున్నా, పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంటుందనే నా తాపత్రయం.
‘పొన్నియిన్ సెల్వన్’లో సముద్ర కుమారి పాత్రకు ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఆ విమర్శలు కథాపరమైనవేననీ, నా నటన గురించి కాదనీ తర్వాత
గ్రహించాను. ఐదు పుస్తకాల కథను రెండు భాగాల్లో ఇమడ్చటం వల్ల నా పాత్రకు ప్రాధాన్యం తగ్గింది.
Read More :
“Aishwarya Lekshmi | మినీ టాప్‌లో మెస్మరైజ్ చేస్తున్న ఐశ్వర్య లక్ష్మి..”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

