Aindrila Sharma | ఇండస్ట్రీలో విషాదం.. బెంగాళి నటి ఐంద్రిలా శర్మ మృతి..!
Aindrila Sharma Passes away | ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బెంగాళి నటి ఐంద్రిలా శర్మ(24) మరణించింది. గత కొంత కాలంగా ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న ఐంద్రిలా ఆదివారం కన్నుమూసింది.
Aindrila Sharma Passes away | ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బెంగాళి నటి ఐంద్రిలా శర్మ(24) మరణించింది. గత కొంత కాలంగా ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న ఐంద్రిలా ఆదివారం కన్నుమూసింది. బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆమె నవంబర్ 1న కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. రెండు వారాలుగా వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్న ఐంద్రిలాకు నవంబర్ 15న గుండెపోటు వచ్చింది. ఒకటి కంటే ఎక్కువ సార్లు గుండెపోటు రావడంతో వెంటిలేటర్‌పైనే ఉంచి ఆమెకు చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచింది. ఈమె మరణం పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం ప్రకటిస్తున్నారు.
గతంలో ఈమె రెండు సార్లు క్యాన్సర్‌ను జయించింది. ‘జుమూర్’, ‘జియోన్ కాథీ’ వంటి సీరియల్స్‌తో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించిన ఐంద్రిలా ‘లవ్కేఫ్’, ‘అమీ దీదీ నెం.1’ వంటి సినిమాల్లోనూ నటించింది. సబ్బులకు సంబంధించిన అనేక యాడ్స్‌లోనూ ఈమె నటించింది. ఇటీవలే రిలీజైన ‘బాగర్’ వెబ్ సిరీస్‌లో ఈమె కీలకపాత్ర పోషించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

