90శాతం వాగ్ధానాలు పూర్తయ్యాయి
‘మా’ అసోసియేషన్‌కు వ్యతిరేకంగా ఏ నటీనటులైనా, కార్యవర్గ సభ్యులెవరైనా ధర్నాలు చేసినా, మీడియాకు వెళ్లినా వారి సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేస్తాం. ‘మా’కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టినా వారు సభ్యత్వానికి అనర్హులు అవుతారని మంచు విష్ణు అన్నారు.
‘మా’ అసోసియేషన్‌కు వ్యతిరేకంగా ఏ నటీనటులైనా, కార్యవర్గ సభ్యులెవరైనా ధర్నాలు చేసినా, మీడియాకు వెళ్లినా వారి సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేస్తాం. ‘మా’కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టినా వారు సభ్యత్వానికి అనర్హులు అవుతారని మంచు విష్ణు అన్నారు. ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు. ’మా’ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించి ఎడాది కాలం పూర్తయిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. 2021 ‘మా’ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపించాయని అన్నారు.
‘గత ఏడాది అక్టోబరు 13న ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాను. ‘మా’ ఎన్నికల్లో నేను చేసిన వాగ్ధానాలు 90 శాతం పూర్తయ్యాయి. త్వరలోనే ‘మా’ భవనానికి ప్రణాళికలు సిద్ధం చేస్తాం. ‘మా’ అసోసియేషన్‌లో సభ్యత్వాన్ని కఠినంగా ఉండేలా తుది నిర్ణయం తీసుకున్నాం. అసోసియేషన్‌లో 20 శాతం మంది నటులు కాని సభ్యులు ఉన్నారు. ఐదేండ్లు శాశ్వత సభ్యుడిగా ఉంటేనే మా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది.
నటీనటుల అవకాశాల కోసం ప్రత్యేక బుక్లెట్ తయారుచేస్తున్నాం. ‘మా’ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్నవారికే సినిమాలో నటించే అవకాశం ఇవ్వాలని నిర్మాతలను కోరుతున్నాం’ అని అన్నారు. ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు మాట్లాడుతూ.. “మా’ ఎన్నికల్లో విష్ణు ఓడిపోవాలని కోరుకున్న వాళ్లు కూడా బాగుండాలి. ‘మా’ అసోసియేషన్ సభ్యులందరూ కలిసి ఐక్యంగా ఉండాలి. మంచు విష్ణు చేసే పనుల్లో మోసం లేదు, దగా లేదు. అసోసియేషన్ అభివృద్ధికి పాటుపడుతున్నా’డని అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

