శ్మశాన నిశ్శబ్దాన్ని చేధించిన రాయ
‘కేజీఎఫ్'ఫేం యశ్ కథానాయకుడిగా రూపొందుతున్న హై ఓల్టేజ్ ఎమోషనల్ కమర్షియల్ థ్రిల్లర్ ‘టాక్సిక్ : ఎ ఫెయిరీటెల్ ఫర్ గ్రోన్ అప్స్'. కియారా అద్వానీ కథానాయిక. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ పానిండియా చిత్రాన్ని వెంకట్ కె.నారాయణతో కలిసి యశ్ నిర్మిస్తున్నారు.
‘కేజీఎఫ్’ఫేం యశ్ కథానాయకుడిగా రూపొందుతున్న హై ఓల్టేజ్ ఎమోషనల్ కమర్షియల్ థ్రిల్లర్ ‘టాక్సిక్ : ఎ ఫెయిరీటెల్ ఫర్ గ్రోన్ అప్స్’. కియారా అద్వానీ కథానాయిక. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ పానిండియా చిత్రాన్ని వెంకట్ కె.నారాయణతో కలిసి యశ్ నిర్మిస్తున్నారు. మార్చి 19న సినిమా విడుదల కానున్నది. ఈ నెల 8(గురువారం) హీరో యశ్ పుట్టినరోజు సందర్భంగా ‘టాక్సిక్’లో ఆయన పాత్రను పరిచయం చేస్తూ క్యారెక్టర్ ఇంట్రో టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.
ఇందులో యశ్ నటిస్తున్న ‘రాయ’ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా, బోల్డ్‌గా ఉంటుందో ఈ టీజర్ తెలియజెప్పింది. మాస్ ప్రేక్షకుల్ని ఆకర్షించేలా ఈ టీజర్ సాగింది. ఇక టీజర్‌ని గమనిస్తే.. ఓ శ్మశానంలో కొందరు మాఫియా వ్యక్తులు గన్స్‌తో పహారా కాస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో శవ ఖననం జరుగుతోంది.
ఆ నిశ్శబ్దాన్ని చేధిస్తూ ఓ అడుగు పడింది. అదే ‘రాయ’.. అతని రాకతో ఆ శ్మశానమంతా గన్ ఫైరింగ్‌తో మోగిపోయింది. అప్పటిదాకా ప్రాణాలతో ఉన్నవారంతా శవాలుగా మారారు. ఆ పొగ మధ్య నుంచి రాయ రివీలయ్యాడు. ఇప్పటికే ఈ సినిమాలో నటిస్తున్న కథానాయికలు కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేష్, రుక్మిణి వసంత్, తారా సుతారియా పాత్రలను పరిచయం చేస్తూ వారి లుక్స్‌ని విడుదల చేశారు. ఇప్పుడు ఇందులోని మెయిన్ క్యారెక్టర్ ‘రాయ’ పాత్రను విడుదల చేయడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రానికి కెమెరా: రాజీవ్వ్రి, సంగీతం: రవి బస్రూర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sweet Corn | మీ డైట్లో స్వీట్ కార్న్ ఉందా.. అయితే మీ ఆరోగ్య సమస్యలకు మీరు చెక్ పెడుతున్నట్టే..!
Rinku Singh | సమాజ్‌వాది పార్టీ ఎంపీని పెళ్లి చేసుకోబోతున్న క్రికెటర్ రింకూ సింగ్.. ఆమె ఎవరంటే..!
Pregnancy | 30 ఏళ్ల వయస్సులో గర్భం దాల్చడం కష్టమవుతుందా.. అండాల సంఖ్య తగ్గుతుందా..?
Bulgaria Accident | పొగమంచు ఎఫెక్ట్.. ఒకదానినొకటి ఢీకొన్న 86 వాహనాలు.. 12 మంది మృతి
Health Tips | వ్యాయామం చేసేటప్పుడు ఏదిపడితే అది తింటే ప్రమాదం.. ఎందుకో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

