తమిళ అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు హీరో విశాల్. ప్రస్తుతం ఆయన సినిమాలతో బిజీగా ఉండటంతో పాటు దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా తన పెళ్లి గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు విశాల్. ఇటీవల చెన్నైలో ఓ సేవా సంస్థ ఆధ్వర్యంలో పదకొండు మంది పేద జంటలకు పెళ్లి జరిపించారు విశాల్. వారికి ఆర్థిక సహాయం కూడా అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తాను త్వరలో ప్రేమ వివాహం చేసుకోబోతున్నానని తెలిపారు. ప్రేమించిన అమ్మాయిని త్వరలో అందరికి పరిచయం చేస్తానని అన్నారు.
‘నేను ప్రేమ వివాహమే చేసుకోవాలనుకుంటున్నా. అరెంజ్డ్ మ్యారేజ్ నాకు సూట్ కాదనిపిస్తుంది’ అని విశాల్ పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన అనీషారెడ్డితో విశాల్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొద్ది మాసాలకే వారు నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో విశాల్ తన పెళ్లిపై చేసిన కామెంట్స్ హాట్‌టాపిక్‌గా మారాయి.