Vishal | విజయ్ సర్కార్‌పై ఉత్కంఠ.. గవర్నర్ తీరును తప్పుబట్టిన హీరో విశాల్!
Actor Vishal Questions TN Governor | నటుడు విశాల్ (Vishal) తమిళనాడు రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.
Actor Vishal Questions TN Governor | నటుడు విశాల్ (Vishal) తమిళనాడు రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. విజయ్ (Thalapathy Vijay) నేతృత్వంలోని TVK (తమిళ వెట్రి కజగం) పార్టీకి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వం ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై విశాల్ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. గతంలో గోవా, మణిపూర్, మేఘాలయ మరియు ముఖ్యంగా కర్ణాటకలో జరిగిన సంఘటనలను గుర్తు చేస్తూ.. ఆయా రాష్ట్రాల్లో అతిపెద్ద పార్టీని పిలిచి ‘ఫ్లోర్ టెస్ట్’ (బలనిరూపణ) ద్వారా ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇచ్చారని విశాల్ గుర్తు చేశారు. ఇప్పుడు తమిళనాడులో TVK పార్టీకి మెజారిటీ స్థానాలు వచ్చినప్పటికీ, గవర్నర్ ఎందుకు వెనకాడుతున్నారని ఆయన నిలదీశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని, రాష్ట్రంలో గవర్నర్ పాలన కాదు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండాలని విశాల్ డిమాండ్ చేశారు. విజయ్ కచ్చితంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, ఒక ఓటరుగా తాను అదే కోరుకుంటున్నానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 233 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉందని, ఈ విషయంలో రాజ్యాంగపరమైన హక్కులను గౌరవించాలని ఆయన కోరారు.
Just like the same scenario that happened in 2017 /18 in Goa, Manipur,Meghalaya and most importantly in Karnataka. The government was formed and then was asked to prove their majority in the “floor test “ in the assembly. Why is the governor of Tamil Nadu hesitating to give…
— Vishal (@VishalKOfficial) May 7, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

