Vijay Thalapathy | గ్యాంగ్‌స్టర్ డ్రామాగా విజయ్ తదుపరి చిత్రం?
Vijay Thalapathy-Lokesh Kanagaraj Movie | ఇండస్ట్రీలో ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయితే మళ్ళీ ఆ హీరో, దర్శకుడు కలిసి సినిమా చేయాలని ఆసక్తి చూపుతుంటారు. ప్రేక్షకులలో కూడా మళ్ళీ వీళ్ళ కాంబోలో సినిమా వస్తే బావుంటుందని అభిప్రాయ పడుతుంటారు. ఒకవేళ అన్ని కుదిరి ఆ కాంబోలో సినిమా సెట్టయితే మాత్రం ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడుతుంటాయి. అలాంటి కాంబినేషన్లో విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబో ఒకటి. వీళ్ళ కాంబోలో సినిమా తెరకెక్కుతుందంటే ప్రేక్షకులే కాదు. సినీ ప్రముఖులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన ‘మాస్టర్’ మంచి విజయం సాధించింది. ఈ సినిమా సక్సెస్ మీట్లోనే వీళ్ళ కాంబోలో సినిమా ఉంటుందని అనౌన్స్ చేశారు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన బిగ్ అప్డేట్ను లోకేష్ కనగరాజ్ వెల్లడించాడు. ఈ చిత్రం గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కనున్నట్లు వెల్లడించాడు. దాంతో విజయ్ అభిమానులలో ఈ చిత్రంపై తీవ్ర ఆసక్తి నెలకొంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చుతున్నాడు. ప్రస్తుతం ‘విక్రమ్’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న లోకేష్ త్వరలోనే ఈ చిత్రంపై ఫుల్ ఫోకస్‌ను పెట్టనున్నాడు. ఇక విజయ్ ప్రస్తుతం వంశీ పైడి పల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. రష్మిక హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

