Trisha Krishnan | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ప్రముఖ నటి త్రిష కృష్ణన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం సిరా చుక్క ఉన్న తన వేలిని చూపిస్తూ ఫోటో దిగిన త్రిష, ఆ పోస్ట్‌కు విజయ్‌తో కలిసి నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘ఘిల్లీ’లోని “అర్జునర్ విల్లు” పాటను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా ఎంచుకుంది. ముఖ్యంగా ఆ పాటలోని విజిల్ వచ్చే భాగాన్ని కట్ చేసి ఆమె ప్రత్యేకంగా పోస్ట్ చేయడంతో త్రిష విజయ్ పార్టీకి వేసిందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ పోస్ట్ చూసిన దళపతి విజయ్ అభిమానులు కోడ్ వర్డ్ యాక్సెప్టెడ్ అంటూ కామెంట్లతో హోరెత్తిస్తుండగా, మరికొందరు ఆమెను వదినమ్మ (తమిళంలో అన్ని) అని సంబోధిస్తూ పోస్టులు పెడుతున్నారు. గత కొంతకాలంగా విజయ్, త్రిషల మధ్య రిలేషన్ ఉందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, త్రిష చేసిన ఈ హింట్ వారిద్దరి మధ్య ఉన్న అనుబంధంపై జరుగుతున్న చర్చకు మరింత ఆజ్యం పోసింది.
#Trisha VOTED ~ CODE WORD ACCEPTED 😁🙏@TVKPartyHQ | #WhistlePodu pic.twitter.com/lVDZR2kTPW
— Prakash Vijay (@PrakazVijay_Of) April 23, 2026