కేపీఎన్ చౌహాన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘సేవాదాస్’. ప్రీతి అస్రానీ నాయికగా నటిస్తున్నది. సుమన్, భాను చందర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇస్లావత్ వినోద్ రైనా, సీతారామ్ నాయక్ నిర్మాతలు. ఈ సినిమా ఏప్రిల్ 1న తెలుగుతో పాటు బంజారా, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల అవుతున్నది. తాజాగా ఈ చిత్ర వివరాలను తెలిపే కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నటులు సుమన్, భాను చందర్ మాట్లాడుతూ..‘బంజారా సంస్కృతిని, ఔన్నత్యాన్ని చాటే ఈ సినిమాలో నటించడం గర్వంగా ఉంది. నటులుగా పూర్తి సంతృప్తినిచ్చిన చిత్రమిది. ప్రేక్షకులు మంచి విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం’ అన్నారు.