Actor Siddharth | సమాజానికి తప్పుడు సందేశం ఇచ్చే రోల్స్ చేయను: నటుడు సిద్ధార్థ్
Actor Siddharth | ప్రముఖ నటుడు సిద్ధార్థ్ తాజాగా నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న 'ఆపరేషన్ సఫేద్ సాగర్' (Operation Safed Sagar) వెబ్ సిరీస్‌లో తన అద్భుతమైన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
Actor Siddharth | ప్రముఖ నటుడు సిద్ధార్థ్ తన వైవిధ్యమైన నటనతో ఎప్పుడూ ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంటారు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ (Operation Safed Sagar) వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతూ సంచలనం సృష్టిస్తోంది. ఈ సిరీస్‌లో సిద్ధార్థ్ తన అద్భుతమైన అభినయంతో మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ తరుణంలో సినిమాల్లో పాత్రలను ఎంపిక చేసుకునే విషయంలో తాను కచ్చితంగా పాటించే కొన్ని కఠినమైన నియమ నిబంధనల గురించి సిద్ధార్థ్ తాజాగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
సినిమాల్లో హీరో అంటే కేవలం గ్లామర్ పాత్రలే కాదని, నటుడిగా తన పరిధులకు తగినట్టుగానే ప్రాజెక్ట్‌లను ఎంచుకుంటానని సిద్ధార్థ్ స్పష్టం చేశారు. ప్రతి సినిమాలోనూ తానే ప్రధాన హీరోగా నటించాలనే మూస పద్ధతిని తాను ఎప్పుడూ నమ్మలేదన్నారు. ఒకవేళ తాను హీరోగా కనిపించని చిత్రాల్లో నటిస్తే, కేవలం ఒక నటుడిగానే ప్రేక్షకులను అలరిస్తానని తెలిపారు. అయితే, పూర్తిగా నెగెటివ్ షేడ్స్ ఉన్న ఒక చెడ్డ పాత్రను పోషించి, ఆ వ్యక్తి తప్పులు చేస్తున్నప్పటికీ అతడే గొప్పవాడని, రియల్ హీరో అని ప్రేక్షకులను భ్రమపెట్టేలా తప్పుదోవ తొక్కించే పాత్రలను తాను ఎప్పటికీ చేయనని కుండబద్దలు కొట్టారు. ఒకవేళ అలా చేస్తే అది తన వ్యక్తిగత సిద్ధాంతాలకు విరుద్ధం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అలాగే సినిమాల్లో ఐటెం సాంగ్స్‌లో నటించడంపై సిద్ధార్థ్ తన వ్యతిరేకతను మరోసారి గట్టిగా వ్యక్తపరిచారు. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఇప్పటివరకు ఎప్పుడూ ఐటెం సాంగ్స్‌లో భాగం కాలేదని, భవిష్యత్తులోనూ చేయనని ఆయన స్పష్టం చేశారు. ఒక మహిళా నటిని నలుగురు పురుషుల మధ్య ఉంచి, ఆమెను కించపరిచేలా లేదా అసభ్యంగా ప్రవర్తించేలా సాగే ప్రత్యేక గీతాలను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.
అయితే, సినిమాల్లో విలన్ పాత్రలు చేయడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని సిద్ధార్థ్ స్పష్టం చేశారు. ఒకవేళ తాను విలన్‌గా నటిస్తే, ఆ పాత్రలో అరాచకాలు చేయడానికి అంగీకరిస్తానని, ఎందుకంటే కథ ప్రకారం ఆ సినిమాలో తప్పులు చేసిన విలన్ చివరకు సరైన శిక్ష అనుభవించి అంతం అవుతాడని గుర్తుచేశారు. కానీ, సమాజంలో నేరాలు చేస్తూ, మహిళలను తక్కువ చేసి చూపిస్తూ, చివరకు ఎలాంటి శిక్ష పడకుండా హీరోలా విజయం సాధించే పాత్రలను మాత్రం తాను ఎప్పటికీ అంగీకరించబోనని తేల్చిచెప్పారు. థియేటర్ల నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులు అలాంటి తప్పులను ఆదర్శంగా తీసుకునేలా ప్రేరేపించే ఏ ఒక్క పాత్రకూ తాను న్యాయం చేయలేనని, తన సినిమాల ద్వారా ఎప్పుడూ సానుకూల దృక్పథాన్నే అందించడానికి ప్రయత్నిస్తానని సిద్ధార్థ్ వెల్లడించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

