Shiraz Mehdi | టాలీవుడ్లో మాఫియా రాజ్యం.. చిన్న సినిమాలపై కక్ష సాధింపు: హీరో షిరాజ్ మెహదీ సంచలన వ్యాఖ్యలు!
Shiraz Mehdi | హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో, మూవీ మేకర్ షిరాజ్ మెహదీ తెలుగు సినీ పరిశ్రమపై తీవ్ర సంచలన ఆరోపణలు చేశారు.
Shiraz Mehdi | హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో, మూవీ మేకర్ షిరాజ్ మెహదీ తెలుగు సినీ పరిశ్రమపై తీవ్ర సంచలన ఆరోపణలు చేశారు. టాలీవుడ్లో మాఫియా తరహా వ్యవస్థ నడుస్తోందని, చిన్న సినిమాలు, నిర్మాతల గొంతు నొక్కుతున్నారని ఆయన మండిపడ్డారు. తాను నిర్మించి హీరోగా నటించిన ‘ఓ అందాల రాక్షసీ’ చిత్రానికి థియేటర్లు కేటాయించకుండా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద సినిమాలకు పెద్దపీట వేస్తూ చిన్న చిత్రాలను పక్కన పెడుతున్నారని, క్యూబ్, యూఎఫ్ఓ వంటి డిజిటల్ ప్రొవైడర్ల పేరుతో నిర్మాతల నుంచి భారీగా దోపిడీ జరుగుతోందని విమర్శించారు.
ఐనాక్స్, పీవీఆర్, ఏషియన్ ఫిల్మ్స్ వంటి ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థలు చివరి నిమిషంలో చేతులెత్తేశాయని, దీనిపై ఇప్పటికే హైకోర్టు నుంచి సమన్లు కూడా వెళ్లాయని తెలిపారు. చిన్న నిర్మాతలు, టెక్నీషియన్ల సమస్యలను ఫిల్మ్ ఛాంబర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమలోని సమస్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తనకు ఎన్ని బెదిరింపులు వచ్చినా, ప్రాణాలు పోయినా చిన్న సినిమాల హక్కుల కోసం తన పోరాటం ఆగదని, త్వరలోనే ‘ఓ అందాల రాక్షసీ’ చిత్రాన్ని రీరిలీజ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Protein Vs Fiber | బరువు తగ్గాలంటే ప్రొటీనా? ఫైబరా? అసలు నిజం ఇదే!
Toxic | యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. రూ.200 కోట్ల ఓటీటీ డీల్‌పై నీలినీడలు!
Hanuma Reddy | రిలీజ్ ముందే బంపరాఫర్.. యష్‌తో డేవిడ్ రెడ్డి దర్శకుడు కొత్త సినిమా?
Supriya Sule | సుప్రియా సూలే అల్లుడికి చెందిన సంస్థకు.. 1,200 ఎకరాల భూమిని లీజుకిచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం
పురాతన ఆలయ గోపురం ధ్వంసం.. సుదర్శన చక్రం చోరీకి యత్నం?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

