Actor Shiraj Mehdi | థియేటర్లు ఇవ్వరు.. ఓటీటీకి అమ్ముకోనివ్వరు: చిన్న సినిమాల సంక్షోభంపై షిరాజ్ మెహదీ ఫైర్!
Actor Shiraj Mehdi | తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాల నిర్మాతలు ఎదుర్కొంటున్న కష్టాలు, వివక్షపై ‘ఓ అందాల రాక్షసీ’ చిత్ర నటుడు, నిర్మాత షిరాజ్ మెహదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Actor Shiraj Mehdi | తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాల నిర్మాతలు ఎదుర్కొంటున్న కష్టాలు, వివక్షపై ‘ఓ అందాల రాక్షసీ’ చిత్ర నటుడు, నిర్మాత షిరాజ్ మెహదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సినిమా నిర్మాణం పూర్తి చేయడం ఒక ఎత్తయితే, దాన్ని థియేటర్లలో విడుదల చేయడం, వ్యాపార హక్కులు దక్కించుకోవడం మరో పెద్ద పరీక్షగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద సినిమాలకే ప్రాధాన్యతనిస్తూ, చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా, ఓటీటీ మరియు శాటిలైట్ హక్కులను అమ్ముకోనివ్వకుండా కొందరు ఇండస్ట్రీ పెద్దలు కుట్ర పన్నుతున్నారని ఆయన సంచలన ఆరోపణలు గుప్పించారు. సినిమా తీయడమే నిర్మాతలు చేసిన నేరమా అని ప్రశ్నిస్తూ, తెలుగు ఫిలిం ఛాంబర్తో పాటు పీవీఆర్, ఐనాక్స్, ఏషియన్ ఫిలిమ్స్ వంటి ప్రముఖ సంస్థల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సినిమా రంగంలో చిన్న నిర్మాతలకు అండగా ఉండాల్సిన ఫిలిం ఛాంబర్, ‘మీరు సినిమా ఎందుకు తీశారు?’ అన్నట్లుగా వ్యవహరిస్తోందని, ఇతరులు తీసే సినిమాలతో తమకు సంబంధం లేదనే ధోరణి ప్రదర్శించడం బాధాకరమని అన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్ స్థానంలో ప్రత్యేకంగా తెలంగాణ విభాగాన్ని ఏర్పాటు చేయాలని షిరాజ్ మెహదీ గట్టిగా డిమాండ్ చేశారు. పెట్టుబడులు పెట్టి, అప్పులు చేసి సినిమాలు తీసే నిర్మాతలు థియేటర్లు దొరక్క, ఓటీటీ సంస్థలు కొనుగోలు చేయక ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని రోడ్డునపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద సినిమాలకు దక్కే అన్ని రకాల వాణిజ్య అవకాశాలు చిన్న సినిమాలకు కూడా పారదర్శకంగా లభించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఒక రైతు నష్టపోయినా, ప్రాణాలు కోల్పోయినా సమాజం స్పందిస్తుందని, మరి సినిమా కోసం సర్వస్వం కోల్పోయే చిన్న నిర్మాతలు, దర్శకులు, నటీనటుల జీవితాలను ఎందుకు పట్టించుకోరని ఆయన భావోద్వేగంతో నిలదీశారు. చిన్న సినిమాల వెనుక ఎన్నో కుటుంబాల భవిష్యత్తు ముడిపడి ఉంటుందని గుర్తుచేశారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని, చిన్న సినిమాలను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చిన్న బడ్జెట్ చిత్రాలకు ప్రభుత్వ సబ్సిడీలు అందించాలని, థియేటర్ల కేటాయింపుల్లో పారదర్శకతను తీసుకురావాలని కోరారు. దిల్ రాజు, సురేష్ బాబుతో పాటు పలు ప్రముఖ సంస్థలు, థియేటర్ యాజమాన్యాలకు తాము లీగల్ నోటీసులు, గ్రీవెన్స్ పిటిషన్లు పంపినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని షిరాజ్ మెహదీ వెల్లడించారు. ఇప్పటికైనా చిత్ర పరిశ్రమలోని పెద్దలు స్పందించి చిన్న సినిమాలను బతికించాలని ఆయన కోరారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

