Sundeep Kishan Hair Tips | టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ సోషల్ మీడియాలో తన అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటాడన్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ అభిమాని తన జుట్టును పొడవుగా పెంచుకోవడానికి ఏవైనా చిట్కాలు చెప్పమని ఎక్స్ వేదికగా సందీప్‌ను కోరగా, ఈ హీరో చాలా ఓపిగ్గా తన హెయిర్ కేర్ సీక్రెట్స్‌ను పంచుకున్నాడు.
వీర అనే అభిమాని సందీప్‌ను ట్యాగ్ చేస్తూ.. అన్నా, లాంగ్ హెయిర్ పెంచడానికి ఏవైనా టిప్స్ ఇవ్వొచ్చుగా? అని అడుగగా.. సందీప్ సమాధానమిస్తూ.. కేవలం పైపైన చిట్కాలు చెప్పడమే కాకుండా, లోపలి నుంచి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా వివరించాడు.
తేలికగా అరిగే శుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలని, చక్కెర మరియు నూనెలో వేయించిన పదార్థాలను పూర్తిగా తగ్గించాలని ఆయన సూచించాడు. ప్రతిరోజూ కొంచెం పెరుగు తీసుకోవడం, ఉదయాన్నే పరగడుపున ‘కార్డియో’ వ్యాయామాలు చేయడం, అలాగే సూపర్ సీడ్ మిక్స్ తీసుకోవడం జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని సందీప్ తెలిపాడు. ఇక జుట్టు సంరక్షణ కోసం కొబ్బరి నూనెతో పాటు ఉల్లిపాయలు, కరివేపాకు, రోజ్మెరీ వంటి వాటితో ఇంట్లోనే తయారుచేసిన నూనెను వాడాలని సందీప్ సలహా ఇచ్చారు. తలస్నానానికి వాడే నీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని, దుమ్ము నుంచి జుట్టును కాపాడుకోవాలని చెబుతూనే, అన్నింటికంటే ముఖ్యంగా మన జుట్టును మనం ప్రేమగా చూసుకోవాలని పేర్కొన్నాడు. పైన చెప్పినవన్నీ ప్రతిరోజూ పాటించడంతో పాటు, మనం దంతాల కోసం డాక్టర్‌ను సంప్రదించినట్లే జుట్టు ఆరోగ్యం కోసం కనీసం ఆరు నెలలకోసారి స్పెషలిస్ట్ డాక్టర్‌ను కలిసి సలహా తీసుకోవడం ఉత్తమమని ఈ యంగ్ హీరో ముగించాడు. ప్రస్తుతం సందీప్ కిషన్ ఇచ్చిన ఈ హెయిర్ కేర్ టిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం నటుడిగానే కాకుండా ఆరోగ్యం పట్ల ఆయనకు ఉన్న అవగాహనను చూసి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
Eat clean food that digests easy,
completely Reduce Sugar & Deep fried food (Konchem perugu everyday) ,
work out & empty stomach cardio,
apply coconut oil & homemade Oil (onions/curryleaves/rosemary oil/etc mix),
Have the SuperSeed Mix in the morning,
Careful with the water you…— Sundeep Kishan (@sundeepkishan) April 7, 2026