Rana Daggubati | సోనమ్‌కు సారీ చెప్పిన రానా!
దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన ‘కింగ్ ఆఫ్ కోతా’ ప్రీరిలీజ్ వేడుక ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. దీనికి హీరో రానా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్‌తో తనకున్న అనుబంధం గురించి ఆయన మాట్లాడారు.
దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన ‘కింగ్ ఆఫ్ కోతా’ ప్రీరిలీజ్ వేడుక ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. దీనికి హీరో రానా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్‌తో తనకున్న అనుబంధం గురించి ఆయన మాట్లాడారు. ఈ ప్రసంగంలో కొన్ని మాటలు వివాదాస్పదమయ్యాయి. బాలీవుడ్ నటి సోనమ్కపూర్ను ఉద్దేశించి పరోక్షంగా రానా మాట్లాడారని సోషల్‌మీడియాలో చర్చ మొదలైంది. ఈ సందర్భంగా సోషల్‌మీడియా వేదికగా సోనమ్‌కపూర్, దుల్కర్ సల్మాన్‌లకు రానా క్షమాపణలు చెప్పారు. ఇంతకి రానా తన స్పీచ్‌లో ఏమన్నారంటే..‘దుల్కర్ యాక్టింగ్ స్కూల్లో నా జూనియర్.
తను చాలా మృదుస్వభావి. ఓపిక చాలా ఎక్కువ. ఓ సారి నేను హిందీ సినిమా షూటింగ్‌కు వెళ్లాను. ఆ చిత్ర నిర్మాతలు నాకు చాలా సన్నిహితులు. సెట్లో దుల్కర్ సల్మాన్ ఓ పక్కన నిల్చొని ఉన్నాడు. ఆ సినిమాలో నటిస్తున్న ఓ పెద్ద హీరోయిన్ మాత్రం తన భర్తతో ఫోన్లో షాపింగ్ గురించి మాట్లాడుతున్నది. ఆమె ప్రవర్తన సెట్లో ఎవరికి నచ్చడం లేదు. అలాంటి పరిస్థితిలో కూడా దుల్కర్ సల్మాన్ చాలా ప్రశాంతంగా ఉన్నాడు.
ఆ హీరోయిన్ ప్రవర్తన గురించి తర్వాత నిర్మాతలతో మాట్లాడాను’ అని రానా అన్నారు. రానా చెప్పిన సంఘటన ‘ది జోయా ఫ్యాక్టర్’ అనే సినిమా సెట్లో జరిగిందని నెటిజన్లు నిర్దారణకు వచ్చారు. దీంతో సోనమ్కపూర్ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ వ్యవహారంపై రానా ట్విట్టర్లో క్షమాపణలు తెలిపారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని..దుల్కర్, సోనమ్‌కపూర్ తనకు మంచి మిత్రులని చెప్పారు. ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని ఆయన ట్విట్టర్లో అభ్యర్థించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

