Ram Charan | క్రికెట్‌కి సచిన్.. ఇండియన్ సినిమాకు శంకర్: రామ్‌చరణ్
‘శంకర్‌గారు కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా. క్రికెట్‌కు సచిన్ ఎలాగో, ఇండియన్ సినిమాకు శంకర్‌గారు అలా. అలాంటి శంకర్‌గారితో పనిచేయడం నా అదృష్టం. నానుంచి సోలో ఫిల్మ్ వచ్చి అయిదేళ్లయింది. ఇది నాకు ప్రత్యేకమైన సినిమా.
Ram Charan | ‘శంకర్‌గారు కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా. క్రికెట్‌కు సచిన్ ఎలాగో, ఇండియన్ సినిమాకు శంకర్‌గారు అలా. అలాంటి శంకర్‌గారితో పనిచేయడం నా అదృష్టం. నానుంచి సోలో ఫిల్మ్ వచ్చి అయిదేళ్లయింది. ఇది నాకు ప్రత్యేకమైన సినిమా. ఈ మూవీ ఏ ఒక్కర్నీ నిరాశపరచదు.’ అని రామ్‌చరణ్ అన్నారు. ఆయన హీరోగా రూపొందుతున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఎస్.శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమా జనవరి 10న విడుదల కానుంది.
ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ అమెరికా డల్లాస్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి అగ్ర దర్శకుడు సుకుమార్ అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ “రంగస్థలం’కు రామ్‌చరణ్ జాతీయ అవార్డు తీసుకుంటాడని ఆశించా. కానీ రాలేదు. అయితే.. ‘గేమ్ చేంజర్’ ైక్లెమాక్స్ చూశాక, ఈ సినిమాలోని రామ్‌చరణ్ నటనకు పక్కాగా జాతీయ అవార్డు వస్తుందనిపించింది.’ అని తెలిపారు. ‘మా సంస్థలో ఇది 50వ సినిమా. ఇంత పెద్ద బడ్జెట్ సినిమా తీయడం ఇదే ప్రథమం. శంకర్‌గారి సినిమా సెల్ఫోన్లో చూస్తే ఫీల్ రాదు. దాన్ని బిగ్ స్క్రీన్‌పైనే ఎక్స్పీరియన్స్ చేయాలి.
రెండు తెలుగు రాష్ర్టాల్లోని రాజకీయ అంశాలు ఈ సినిమాలో చాలా కనిపిస్తాయి. శంకర్‌గారు అన్నీ తానై నడిపించారు. ఈసారి మామూలుగా కొట్టడంలేదు. గట్టిగా కొట్టబోతున్నాం.’ అని దిల్‌రాజు నమ్మకం వ్యక్తం చేశారు. శంకర్ మాట్లాడుతూ ‘పోకిరి, ఒక్కడు లాంటి మాస్ మసాలా సినిమా చేయాలి.. కానీ అందులో కూడా నా మార్క్ ఉండాలి అనుకొని ఈ ‘గేమ్‌ఛేంజర్’ చేశాను. ప్రభుత్వోజ్యోగి, పొలిటీషియన్ మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా. రామ్‌చరణ్ సెటిల్డ్‌గా చేశాడు. పంచెకట్టులో అప్పన్నగా అదరగొట్టేశాడు. ఈ సినిమాకి అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. రేపు ఆ కష్టాన్ని తెరపై చూస్తారు.’ అని శంకర్ చెప్పారు. ఇంకా అంజలి, సంగీత దర్శకుడు తమన్, నిర్మాత అనిల్ సుంకర, డైరెక్టర్ బుచ్చిబాబు, ఎస్జే సూర్య కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

