Happy Days Movie | మళ్లీ థియేటర్లలోకి కల్ట్ క్లాసిక్ హ్యాపిడేస్.. ఈ సారి స్టూడెంట్స్ రచ్చ మాములుగా ఉండదూ..!
Happy Days Movie | కొన్ని సినిమాలు సినీ లవర్స్‌కు ఎంతలా నచ్చుతాయంటే.. ఎన్నో వందల సార్లు చూసినా సరే మళ్లీ వస్తుందంటే టీవీలకు అతుక్కుపోతుంటాం. అలాంటి సినిమాల్లో హ్యాపీడేస్ ఒకటి. పదహారేళ్ల కిందట వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఓ క్లాసిక్‌గా మిగిలింది.
Happy Days Movie | కొన్ని సినిమాలు సినీ లవర్స్‌కు ఎంతలా నచ్చుతాయంటే.. ఎన్నో వందల సార్లు చూసినా సరే మళ్లీ వస్తుందంటే టీవీలకు అతుక్కుపోతుంటాం. అలాంటి సినిమాల్లో హ్యాపీడేస్ ఒకటి. పదహారేళ్ల కిందట వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఓ క్లాసిక్‌గా మిగిలింది. కాలేజి కుర్రకారుకు ఈ సినిమా ఎంత నచ్చిందంటే.. చాలా మంది ఈ సినిమా చూసి ఇంజనీరింగ్ చేద్దామని డిసైడ్ అయ్యేంతలా. శేఖర్ కమ్ములా టేకింగ్, యాక్టర్స్ టెర్రిఫిక్ పర్మార్మెన్స్, మిక్కీ మ్యూజిక్ ఇలా చెప్పుకుంటే పోతే సినిమా గురించి ఓ పుస్తకమే రాయోచ్చు. అంతలా ఈ సినిమా జనాలకు ఎక్కేసింది. ఇక ఇలాంటి కల్ట్ సినిమాను రీ-రిలీజ్ చేస్తే సినీ లవర్స్‌లో ఉండే ఎగ్జైట్మెంట్ అంతా ఇంతా కాదు.
కాగా తాజాగా యంగ్ సెన్సేషన్ నిఖిల్ సిద్దార్థ ఈ సినిమా రీ-రిలీజ్ గురించి ఓ ట్వీట్ వేశాడు. హ్యాపీడేస్ డేస్ సినిమా రీ-రిలీజ్ ఒకేనా అని ఓ పోస్ట్ వేశాడు. దానికి పలువురు వేయిటింగ్ అని, గ్రేట్ ఐడియా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరైతే ఎందుకు పాత గాయాన్ని మళ్లీ లేపుతారు. ఈ సినిమా వల్లే నా జిందగీ మన్నుల కలిసిందంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమాను కొట్టే కాలేజ్ బ్యాక్‌డ్రాప్ సినిమా ఇప్పటివరకు మరోటి రాలేదన్నది అక్షరాల సత్యం. కాలేజ్ లైఫ్, ఫ్రెండ్స్, లవ్, ర్యాగింగ్, స్ట్రగుల్స్, బ్యాక్ ల్యాగ్స్ ఇలా ఒక మనిషి జీవితంలో బాగా గుర్తుండిపోయే కాలేజ్ డేస్‌ను శేఖర్ కమ్ములా అద్భుతంగా చూపించాడు.
ప్రతీ ఏటా ఎన్నో కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు వస్తుంటాయి. కానీ అవేవి హ్యాపీడేస్‌లో హాఫ్ పర్సెంట్ కూడా సాటిస్ఫై చేయలేకపోతున్నాయి. ఇక హ్యాపిడేస్ కమర్షిలయ్గానూ కోట్లు కొల్లగొట్టింది. కేవలం కోటి రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఫైనల్ రన్లో పది కోట్లు కొల్లగొట్టి బయ్యర్లకు కళ్లు చెదిరే లాభాలే తెచ్చిపెట్టింది. ఇందులో మరో విశేషం ఏంటంటే ఈ సినిమా నిర్మాత కూడా శేఖర్ కమ్ములానే.
Happy Days.. Re Release ?
Ok na ? pic.twitter.com/PoqWu3dRPj— Nikhil Siddhartha (@actor_Nikhil) September 17, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

