Nikhil Siddartha | తండ్రి అయిన టాలీవుడ్ హీరో నిఖిల్.. ఫొటో వైరల్
Nikhil Siddartha | టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ (Nikhil Siddartha) అభిమానులకు గుడ్ న్యూస్. నిఖిల్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య పల్లవి ఈరోజు ఉదయం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. నిఖిల్ తన కుమారుడిని ఎత్తుకుని.. ముద్దాడుతున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Nikhil Siddartha | టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ (Nikhil Siddartha) అభిమానులకు గుడ్ న్యూస్. నిఖిల్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య పల్లవి ఈరోజు ఉదయం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. నిఖిల్ తన కుమారుడిని ఎత్తుకుని.. ముద్దాడుతున్న ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నిఖిల్- పల్లవి దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక నిఖిల్ తండ్రి అయిన సందర్భంగా #నిఖ్పాల్(Nikpal) అనే హాష్‌ట్యాగ్ ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. 2020లో డాక్టర్ పల్లవిని నిఖిల్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2020 కోవిడ్ టైంలో వీరి పెళ్లి కాగా.. కరోనా నిబంధనలను పాటిస్తూ పెళ్లి చేసుకున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. నిఖిల్ ప్రస్తుతం ‘కార్తికేయ 2’ సినిమా ఇచ్చిన జోష్‌తో మరో పాన్ ఇండియా చిత్రం స్వయంభు (Swayambhu) చేస్తున్నాడు. ఈ సినిమాకు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తుండగా.. మలయాళ భామ సంయుక్తామీనన్ (Samyuktha Menon) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇక హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో రానున్న ఈ సినిమాలో నిఖిల్ ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

