Naseeruddin Shah | అవార్డులను బాత్రూం హ్యాండిల్స్ గా పెట్టుకుంటా.. సంచలన వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటుడు
Actor Naseeruddin Shah | బాలీవుడ్ సినీయర్ నటుడు నసీరుద్దీన్ షా అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అవార్డులను తన బాత్ రూమ్ హ్యాండిల్ గా వాడుకుంటా అని అన్నాడు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వూలో నసీరుద్ధీన్ షా మాట్లాడుతూ.. ఒకపాత్ర కోసం ఎంతవరకైనా కష్టపడేవాడు గొప్ప నటుడు అవుతాడు.
Actor Naseeruddin Shah | బాలీవుడ్ సినీయర్ నటుడు నసీరుద్దీన్ షా అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అవార్డులను తన బాత్ రూమ్ హ్యాండిల్ గా వాడుకుంటా అని అన్నాడు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వూలో నసీరుద్ధీన్ షా మాట్లాడుతూ.. ఒకపాత్ర కోసం ఎంతవరకైనా కష్టపడేవాడు గొప్ప నటుడు అవుతాడు. అంతేకాని ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది నటుల్లో ఒకరిని సెలెక్ట్ చేసుకొని అతన్ని ఈ ఏడాది ఉత్తమ నటుడు అని ఎవరో ప్రకటించడం ఎంతవరకు కరెక్ట్ అని భావిస్తాను. అవార్డులు చూసి నేనేమి పొంగిపోను. ఇటీవల నాకు ప్రకటించిన రెండు అవార్డులను తీసుకోవడానికి కూడా వెళ్ళలేదు. కెరీర్ ఆరంభంలో అవార్డులు వస్తే హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఆ తర్వాత వాటి గురించి తెలుసుకున్నాక అవార్డుల మీద ఆసక్తి పోయింది. ఫిలింఫేర్ అని, ఇంకా ఏవేవో పేర్లతో అవార్డులు ఇస్తారు. వాటిల్లో నాకేమి గొప్ప కనిపించట్లేదు అని నసీరుద్దిన్ షా తెలిపాడు.
అంతే కాకుండా ఇప్పటికే తనకు చాలా అవార్డులు వచ్చాయిని, ఒకవేళ తను ఫామ్ హౌస్ కట్టుకుంటే దాంట్లో బాత్రూమ్స్ కి హ్యాండిల్స్ గా అవార్డులను పెట్టాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. ఎందుకంటే అప్పుడు వాష్ రూమ్ కి వెళ్లే వాళ్లంతా ఆ అవార్డులని పట్టుకుంటారని, దాంతో ఆ అవార్డులు వాళ్లకి కూడా వచ్చినట్టే కదా అని చెప్పాడు. ఇక అవార్డుల్లో చాలావరకు లాబీయింగ్ తోనే వస్తాయని, కానీ తనకు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు అందుకున్నప్పుడు మాత్రం సంతోషించినట్లు తెలిపాడు. అది చూసి పైనున్న వాళ్ల నాన్న సంతోషిస్తాడని భావించినట్లు తెలిపాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

