Nagarjuna Akkineni | వివాదానికి ముగింపు.. ఆ అభిమానిని ప్రత్యేకంగా కలిసిన నాగార్జున
కొన్నిసార్లు మన ప్రమేయం ఏమాత్రం లేకుండా జరిగిన సంఘటనల వల్ల కూడా అపవాదును మూటగట్టుకోవాల్సి వస్తుంది. అగ్ర హీరో నాగార్జునకు ఇటీవల అలాంటి పరిస్థితే ఎదురైంది. కొద్దిరోజుల క్రితం ముంబయి ఎయిర్పోర్ట్లో ఓ దివ్యాంగుడైన అభిమాని నాగార్జునను కలవడానికి ప్రయత్నించగా ఆయన సెక్యూరిటీ గార్డ్ అతన్ని పక్కను తోసివేశారు.
Nagarjuna Akkineni | కొన్నిసార్లు మన ప్రమేయం ఏమాత్రం లేకుండా జరిగిన సంఘటనల వల్ల కూడా అపవాదును మూటగట్టుకోవాల్సి వస్తుంది. అగ్ర హీరో నాగార్జునకు ఇటీవల అలాంటి పరిస్థితే ఎదురైంది. కొద్దిరోజుల క్రితం ముంబయి ఎయిర్పోర్ట్లో ఓ దివ్యాంగుడైన అభిమాని నాగార్జునను కలవడానికి ప్రయత్నించగా ఆయన సెక్యూరిటీ గార్డ్ అతన్ని పక్కను తోసివేశారు.
ఈ విషయాన్ని గమనించని నాగార్జున ఎయిర్పోర్ట్ బయటకు వచ్చేశాడు. అయితే అభిమానిని సెక్యూరిటీ గార్డ్ పక్కని తోసివేస్తున్న వీడియోను ఓ వ్యక్తి సోషల్మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది. ‘ఇదేనా మానవత్వం’ అనే క్యాప్షన్తో పెట్టిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పలువురు నెటిజన్లు ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఇన్సిడెంట్ గురించి తెలుసుకున్న నాగార్జున తన సోషల్మీడియా ఖాతా ద్వారా ఆ అభిమానికి క్షమాపణ చెప్పాడు. తనకు తెలియకుండా ఈ సంఘటన జరిగిందని, మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటానని పేర్కొన్నారు.
గురువారం ముంబయి ఎయిర్పోర్ట్లో ఆ అభిమానిని నాగార్జున ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఆప్యాయంగా హత్తుకొని ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఈ వీడియోను నాగ్ ఫ్యాన్స్ సోషల్మీడియాలో షేర్ చేస్తూ ..ఏమాత్రం భేషజాలు లేని రియల్ హీరో నాగార్జున అంటూ కొనియాడుతున్నారు. దీంతో ఈ వివాదానికి ఫుల్స్టాప్ పడ్డట్లయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

