MAA Elections | ‘మా’ ఎన్నికలపై నాగబాబు కీలక వ్యాఖ్యలు.. కోట, బాబుమోహన్‌పై ఫైర్
MAA Elections | మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై సీనియర్ నటుడు నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కోట శ్రీనివాస్ రావు, బాబుమోహన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రకాశ్‌రాజ్ ఎవరిని కోట శ్రీనివాస్ రావు, బాబుమోహన్

హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై సీనియర్ నటుడు నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కోట శ్రీనివాస్ రావు, బాబుమోహన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రకాశ్‌రాజ్ ఎవరిని కోట శ్రీనివాస్ రావు, బాబుమోహన్ అంటున్నారు. ప్రకాశ్‌రాజ్ అంటే కోట, బాబుమోహన్‌కు అంత చులకనా? అని ప్రశ్నించారు. సినిమాకు రూ. కోటి తీసుకునే దమ్మున్నవాడు ప్రకాశ్‌రాజ్. ‘మా’ కోసం కొన్ని సినిమాలు వదులుకున్నాడు. కొన్ని కోట్ల రూపాయాలు వదులుకొని ‘మా’ కోసం ప్రకాశ్‌రాజ్ వస్తున్నాడు. ‘మా’కు సేవ చేస్తానంటే ప్రకాశ్‌రాజ్‌ను కించపరుస్తారా? అని ధ్వజమెత్తారు. తెలుగువాడినే అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని కొందరు అంటున్నారు. తెలుగు నటులు వేరే భాషల్లో నటించట్లేదా? అని అడిగారు. కోట శ్రీనివాస్ రావు తమిళం, కన్నడంలో నటించలేదా? అని ప్రశ్నించారు. ప్రకాశ్‌రాజ్‌ను గెలిపించేందుకు నూటికి నూరు శాతం శ్రమిస్తామని నాగబాబు తేల్చిచెప్పారు.
‘మా’ ఎన్నికల్లో సభ్యులకు డబ్బు ఆశ చూపించడం సరికాదని నాగబాబు అన్నారు. ఒక్కో ఓటరకు రూ. 10 వేలు ఇస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ డబ్బిస్తామని ఆశ చూపుతున్నారు. ప్రకాశ్‌రాజ్ మాకు మూడు సార్లు అధ్యక్షుడిగా ఉండాలి. ప్రకాశ్‌రాజ్ అధ్యక్షుడిగా ఎన్నికైతేనే మా బాగుపడుతుందన్నారు. కొందరు మంచు విష్ణు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విష్ణును గెలిపించాలనే కంగారు మీకెందుకు? అని నాగబాబు ప్రశ్నించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

