తిరుపతి పాత్ర గుర్తుండిపోతుంది
ఇటీవల విడుదలైన ‘ఓదెల-2’ చిత్రంలో ప్రతినాయకుడు తిరుపతి పాత్రలో ప్రేక్షకుల్ని మెప్పించారు కన్నడ నటుడు వశిష్ట ఎన్ సింహ. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంపత్‌నంది క్రియేటర్‌గా వ్యవహరించగా, అశోక్‌తేజ దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో సినిమాలో తన పాత్రకు వస్తున్న స్పందన గురించి బుధవారం పాత్రికేయులతో ముచ్చటించారు నటుడు వశిష్ట ఎన్ సింహ.
ఇటీవల విడుదలైన ‘ఓదెల-2’ చిత్రంలో ప్రతినాయకుడు తిరుపతి పాత్రలో ప్రేక్షకుల్ని మెప్పించారు కన్నడ నటుడు వశిష్ట ఎన్ సింహ. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంపత్‌నంది క్రియేటర్‌గా వ్యవహరించగా, అశోక్‌తేజ దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో సినిమాలో తన పాత్రకు వస్తున్న స్పందన గురించి బుధవారం పాత్రికేయులతో ముచ్చటించారు నటుడు వశిష్ట ఎన్ సింహ. ఆయన మాట్లాడుతూ ‘ఓదెల-2’ సినిమాలో ఈవిల్ క్యారెక్టర్ కోసం స్పెషల్ వాయిస్ మాడ్యులేషన్ ప్రాక్టీస్ చేశా. నా గొంతు బాగా ప్లస్ అయింది. సంపత్‌నంది ఈ సినిమా కాన్సెప్ట్ చెప్పినప్పుడే చాలా సర్ప్రైజ్ అయ్యా’ అన్నారు. తిరుపతి పాత్ర సీన్లో ఉన్నా లేకపోయినా సినిమా మొత్తం అతని నామస్మరణతోనే నిండిపోయిందని, తిరుపతి ఓరకంగా సినిమాకు హీరోలా నిలిచాడని, ఆ పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిందని వశిష్ట ఎన్ సింహ తెలిపారు. ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్ చూసి పెద్ద బ్యానర్ల నుంచి అవకాశాలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

