Actor Karthi injured | నటుడు కార్తికి ప్రమాదం.. ఆగిపోయిన ‘సర్దార్ 2’ షూటింగ్
Actor Karthi | తమిళ నటుడు కార్తికి సర్దార్ 2 షూటింగ్లో ప్రమాదం జరిగింది. దీంతో వెంటనే చిత్రబృందం ఆయనను ఆసుపత్రికి తరలించారు.
Actor Karthi | తమిళ నటుడు కార్తికి ప్రమాదం జరిగింది. ఆయన హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సర్దార్ 2’ (Sardar2) 2022లో వచ్చిన స్పై, యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సర్దార్’కి సీక్వెల్‌గా ఈ చిత్రం రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలో శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు తీస్తుండగా కార్తికి ప్రమాదం జరిగింది. దీంతో అతడి కాలికి గాయం కాగా.. వెంటనే స్పందించిన చిత్రబృందం అతడిని ఆస్పత్రికి తరలించింది.
ప్రస్తుతం కార్తికి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ వారంపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. దీంతో షూటింగ్‌ను మధ్యలోనే ఆపేసినట్లు టాక్. అయితే కార్తికి ఇది రెండో ప్రమాదం. ఇంతకుముందు కూడా సర్దార్ 2 సినిమా షూటింగ్‌లోనే ప్రమాదం జరిగింది. సర్దార్ 2 సినిమా విషయానికి వస్తే.. ఇందులో కార్తి, రజిషా విజయన్ తో పాటు ఎస్జే సూర్య, మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

