Kinnerasani | నేరుగా ఓటీటీలోకి మెగాస్టార్ అల్లుడి సినిమా?
Kinnerasani Movie On OTT | మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ కథల ఎంపిక విషయంలో తడబడుతున్నాడు. రొటీన్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను నిరాశ పరుస్తున్నాడు. ‘విజేత’ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ మొదటి సినిమాతో పర్వాలేదు అనిపించాడు. కాని ఆ తర్వాత వచ్చిన ‘సూపర్ మచ్చి’ బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది. అసలు ఈ సినిమా వచ్చిందన్న విషయమే చాలా మందికి తెలియదు. ప్రస్తుతం ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘కిన్నెర సాని’ విడుదలకు సిద్ధంగా ఉంది.
‘సూపర్ మచ్చి’ కంటే ముందే రూపొందిన ఈ చిత్రాన్ని మేకర్స్ థియేటర్ రిలీజ్‌కు ప్రయత్నించినా కుదరలేదని సమాచారం. దాంతో ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ భావించారట. ఇక ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ జీ-5లో జూన్ 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి రమణతేజ దర్శకత్వం వహించాడు. కళ్యాణ్‌దేవ్‌కు జోడీగా అన్శీతల్, కాశీష్ఖాన్ హీరోయిన్లుగా నటించారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఎస్ఆర్టి ఎంటర్టైనమెంట్స్, శుభమ్ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్లపై రామ్ తాళ్ళూరి నిర్మించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

