J.D. Chakravarthy | జేడీ చక్రవర్తిపై విష ప్రయోగం.. సంచలన విషయాలు బయటపెట్టిన నటుడు
Actor J.D. Chakravarthy | తొంభైయవ దశకంలో జేడీ చక్రవర్తి పేరు తెలియని వారుండరు. మనీ మనీ, గులాబి, దెయ్యం, బాంబే ప్రియుడు ఇలా బ్యాక్ టు బ్యాక్ బంపర్ హిట్లతో తెలుగునాట అప్పట్లో ఓ సెన్సేషన్ అయ్యాడు.
Actor J.D. Chakravarthy | తొంభైయవ దశకంలో జేడీ చక్రవర్తి పేరు తెలియని వారుండరు. మనీ మనీ, గులాబి, దెయ్యం, బాంబే ప్రియుడు ఇలా బ్యాక్ టు బ్యాక్ బంపర్ హిట్లతో తెలుగునాట అప్పట్లో ఓ సెన్సేషన్ అయ్యాడు. ఆ తర్వాత అనూహ్యంగా విలన్గా మారి కొన్ని సినిమాల్లో మెరిసాడు. ఒకానొక టైమ్లో మెగాఫోన్ పట్టి సినిమాలు కూడా తెరకెక్కించాడు. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుతెచ్చుకున్న చక్రవర్తికి ఉన్నట్టుండి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూ వచ్చాడు. ఇక ఈ మధ్య అసలు తెలుగు సినిమాల్లో కనిపించడమే లేదు. అయితే ఇతర భాషల్లో మాత్రం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్లతో బిజీగా గడుపుతున్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా జేడీ తనపై విష ప్రయోగం జరిగిందని సంచలన విషయం బయటపెట్టాడు. నాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. కానీ కొన్ని రోజుల కిందట నాకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టమైంది. దీంతో డాక్టర్లను కలిశా. కానీ ఎవ్వరూ నా సమస్య ఏంటో కనుక్కోలేకపోయారు. విదేశాల్లో కూడా చూపించినా కూడా ఫలితం లేకపోయింది. ఒక దశలో నా పరిస్థితి కష్టమే అని డాక్టర్లు చెప్పేశారు. ఆ టైంలో నా ఫ్రెండ్ చెప్పాడని నాగార్జున అనే డాక్టర్ దగ్గరికి వెళ్లాను. ఆయన నన్ను టెస్ట్ చేసి డ్రగ్స్ ఎందుకు తీసుకుంటున్నావని అడిగారు. నాకు అలాంటి అలవాటే లేదని చెప్పాను.
నేను ఒకప్పుడు ఒక కషాయం తాగేవాడిని. ఆరోగ్యం కోసమని నాతో ఒక వ్యక్తి అది తాగించేవాడు. ఒకసారి ఖాసిం అనే నిర్మాత ఆ కషాయం తాగుతానన్నాడు. అది తాగాక రెండు రోజులు తీవ్ర జ్వరం వచ్చింది. నాకా కషాయం ఇస్తున్న వ్యక్తికి విషయం చెబితే.. నీకోసం చేసిందాన్ని వేరే వాళ్లకు ఎందుకు ఇచ్చావు అని కోప్పడ్డాడు. మా మధ్య దాని మీద పెద్ద గొడవ జరిగింది. చివరికి ఆసుపత్రిలో తేలిందేంటంటే నాకు ఎనిమిది నెలల పాటు స్లో పాయిజన్ ఇచ్చారు. అందు వల్లే నాకు శ్వాస కోశ ఇబ్బందులు వచ్చాయి. దాన్ని వేరే వ్యక్తి తాగితే అతడికి మందు కొట్టే అలవాటు ఉండటం వల్ల తన శరీరం తట్టుకోలేకపోయిందని సంచలన విషయాన్ని బయటపెట్టాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

