Gufi Paintal: మహాభారత్ ఫేమ్ ‘శకుని మామ’ కన్నుమూత
Gufi Paintal: బాలీవుడ్ నటుడు గుఫి పెయింటాల్ మృతిచెందారు. ఆయన వయసు 79 ఏళ్లు. మహాభారత్ సీరియల్లో ఆయన ఫేమస్ శుకుని పాత్రను పోషించారు. ముంబైలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ముంబై: మహాభారత్ టీవీ సీరియల్లో శకుని పాత్రను పోషించిన ప్రఖ్యాత నటుడు గుఫి పెయింటాల్(Gufi Paintal) ఇక లేరు. సోమవారం ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 79 ఏళ్లు, గుఫి మృతిచెందిన సమాచారాన్ని ఆయన బంధువు హితేన్ పెయింటాల్ వెల్లడించారు. సబర్బన్ అంధేరిలోని ఓ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగించారు. ఇవాళ ఉదయం 9 గంటలకు ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు హితేన్ తెలిపారు. 1980 దశకంలో గుఫి అనేక హిందీ చిత్రాల్లో నటించారు. సుహాగ్, దిల్లగీ లాంటి ఫిల్మ్స్‌లో చేశారు. సీఐడీ, హల్లో ఇన్స్పెక్టర్ లాంటి టీవీ షోల్లోనూ నటించారు. బీఆర్ చోప్రా తీసిన మహాభారత్ సీరియల్లో ఫేమస్ శకుని మామ పాత్రను ఆయన పోషించారు. గుఫికి కుమారుడు, కోడలు, మనువలు ఉన్నారు. అంధేరిలోని శ్మశానవాటికలో ఇవాళ సాయంత్రం ఆయన పార్దీవదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

