Sheraz Mehdi | చిన్న సినిమాలపై పెద్ద కుట్ర జరుగుతోంది.. ఫిల్మ్ చాంబర్లో ఆవేదన వ్యక్తం చేసిన దర్శకుడు షెరాజ్ మెహదీ
OAndalaRakshasi | తెలుగు సినీ పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలపై పెద్ద కుట్ర జరుగుతోందని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ సంచలన ఆరోపణలు చేశారు.
తెలుగు సినీ పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలపై పెద్ద కుట్ర జరుగుతోందని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ సంచలన ఆరోపణలు చేశారు. తన చిత్రం ‘ఓ అందాల రాక్షసి’ విడుదల, రీ-రిలీజ్ సమయంలో ఎదురైన ఇబ్బందులపై ఫిల్మ్ చాంబర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన సినిమాపైనే కాకుండా లో-బడ్జెట్ సినిమాల నిర్మాతలందరికీ అన్యాయం జరుగుతోందని షెరాజ్ పేర్కొన్నారు. చిన్న సినిమాలకు థియేటర్లు ఇస్తామని హామీ ఇచ్చి చివరి నిమిషంలో వెనక్కి తీసుకుంటున్నారని ఆరోపించారు. థియేటర్ల కేటాయింపు వ్యవస్థలో రాజకీయాలు పనిచేస్తున్నాయని, దీనివల్ల చిన్న చిత్రాలు తీవ్రంగా నష్టపోతున్నాయని తెలిపారు.
హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో చిన్న చిత్రాలకు పరిమిత సంఖ్యలో మాత్రమే షోలు ఇస్తున్నారని, అవి కూడా ప్రేక్షకులు తక్కువగా వచ్చే సమయాల్లో కేటాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల సినిమాలు ప్రేక్షకుల దృష్టికి చేరకముందే విఫలమయ్యే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. థియేటర్లతో పాటు ఆడియో రైట్స్, శాటిలైట్ హక్కులు, ఓటీటీ ప్లాట్‌ఫార్ములు, ఓవర్సీస్ మార్కెట్ వంటి అన్ని విభాగాల్లోనూ చిన్న సినిమాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. కొత్త దర్శకులు, నిర్మాతలకు అవకాశాలు తగ్గిపోతున్నాయని ఆయన వాపోయారు.
‘ఓ అందాల రాక్షసి’ సినిమా చాలా బాగా వచ్చిందని ప్రివ్యూ చూసిన ప్రతి ఒక్కరూ చెప్పారని, అయినా అంత హిట్ సినిమాను కూడా ఇండస్ట్రీ పెద్దలు రానివ్వడం లేదని షెరాజ్ విమర్శించారు. ఈ సమస్యపై ఫిల్మ్ చాంబర్లో పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన రాలేదని తెలిపారు. భరత్ భూషణ్ గారు తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. థియేటర్ల కేటాయింపులో జరిగిన అన్యాయంపై పీవీఆర్, ఐనాక్స్, ఏషియన్ సినిమాస్ సంస్థలకు లీగల్ నోటీసులు పంపినట్లు వెల్లడించారు. మొదటి విడుదల సమయంలో సరైన అవకాశాలు లభించి ఉంటే రీ-రిలీజ్ అవసరం వచ్చేది కాదని పేర్కొన్నారు.
ఇతర రాష్ట్రాల్లో సినిమాలకు సబ్సిడీలు అందుతున్నాయని, తెలుగు రాష్ట్రాల్లో కూడా చిన్న చిత్రాలకు ప్రత్యేక ప్రోత్సాహక విధానాలు తీసుకురావాలని షెరాజ్ కోరారు. ఇండస్ట్రీలో సమస్యలు ఉన్నప్పటికీ చాలామంది భయంతో బహిరంగంగా మాట్లాడడం లేదని, తాను మాత్రం నిజం కోసం పోరాడుతున్నానని తెలిపారు. పరిస్థితులు మారకపోతే తెలుగు చిత్ర పరిశ్రమను విడిచి ఇతర భాషా పరిశ్రమల్లో పనిచేయాలనే ఆలోచన కూడా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. చిన్న సినిమాలను బతికించమని ఆయన వేడుకున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

