Brahmaji | నవీన్ పొలిశెట్టి నటన చూస్తే భయమేస్తుంది.. బ్రహ్మాజీ సంచలన వ్యాఖ్యలు..!
Brahmaji | ఇప్పుడున్న కుర్ర హీరోల్లో సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో వంద శాతం సక్సెస్ రేటు ఉన్న నటుడు నవీన్ పొలిశెట్టి. హీరోగా చేసింది మూడు సినిమాలే అయినా.. ఆ మూడు అరివీర భయంకర హిట్లు.
Brahmaji | ఇప్పుడున్న కుర్ర హీరోల్లో సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో వంద శాతం సక్సెస్ రేటు ఉన్న నటుడు నవీన్ పొలిశెట్టి. హీరోగా చేసింది మూడు సినిమాలే అయినా.. ఆ మూడు అరివీర భయంకర హిట్లు. ఇక రీసెంట్గా రిలీజైన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ఏకంగా హాఫ్ సెంచరీ కొట్టి సంచలనం సృష్టించాడు. ఈ సినిమాలో నవీన్ నటన, కామెడీ టైమింగ్‌కు ఫిదా అవని ప్రేక్షకుడు లేడు. మరీ ముఖ్యంగా సినీ సెలబ్రెటీలు సైతం నవీన్ యాక్టింగ్‌కు జోహార్లు కొట్టారు. తాజాగా ప్రముఖ నటుడు బ్రహ్మాజీ నవీన్ నటన చూసి మొచ్చుకున్నాడు.
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో ఇంజనీరింగ్ గురించి చెప్పే ఓ డైలాగ్‌ను.. గతంలో నవీన్ కెరీర్ మొదట్లో ఇంజనీరింగ్ కష్టాలను ఉద్దేశించి చేసిన ఓ షార్ట్ ఫిలింలోని డైలాగ్‌ను కలిపి ఓ నెటీజన్ ఫన్నీగా వీడియోను క్రియేట్ చేశాడు. దానికి ‘ఉత్తరాది లేదా దక్షిణాది.. ప్రాంతం ఏదైనా సరే నవీన్ పొలిశెట్టి ఇంజినీర్స్ వాయిస్’ అని ట్వీట్ చేశాడు. దీనిపై నవీన్ సైతం స్పందించి ఆనందం వ్యక్తం చేశాడు. ఇదే వీడియోపై బ్రహ్మాజీ స్పందించి ..నవీన్‌కు ఉన్న టాలెంట్ చూస్తుంటే భయమేస్తుందని చెప్పుకొచ్చారు. ఫ్రస్ట్రేటెడ్ ఇంజినీరింగ్ స్టూడెంట్‌గా నవీన్ నటన చూసి ఫిదా అయ్యానని చెప్పాడు. అంతేకాకుండా ఇక, తాను రిటైర్మెంట్ తీసుకోవడం బెటర్ అంటూ సరదాగా ట్వీట్ వేశాడు.
Ee abbayi talent chusthe naaku bhayamesthundi..ika Nenu retire ayipothe better..🙏🏼🙏🏼🙏🏼 https://t.co/3xQY0hgw1f
— Brahmaji (@actorbrahmaji) October 8, 2023
మధ్య ప్రదేశ్‌లోని భోపాల్ NITలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన నవీన్ తొలినాళ్ల నుంచే నటుడవ్వాలని కలలు కన్నాడు. దాని కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. మొదటి సారిగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఓ చిన్న రోల్ చేశాడు. ఆ తర్వాత పలు షార్ట్ ఫిలింస్ చేశాడు. అయితే నాలుగేళ్ల కిందట వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా నవీన్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక రెండేళ్ల కిందట వచ్చిన జాతిరత్నాలు తిరుగులేని పాపులారిటీ తెచ్చిపెట్టింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

