Allu Arjun | ‘మేజర్’ చిత్రంపై అల్లుఅర్జున్ ప్రశంసలు.. వైరల్ అవుతున్న ట్వీట్
Allu Arjun Tweets On Major Movie | ప్రస్తుతం ఎక్కడ చూసిన ‘మేజర్’ హవానే నడుస్తుంది. అడివిశేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలై సంచలన విజయం సాధించింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివిశేష్ జీవించేశాడు. తన నటనకు విమర్శకులు సైతం జైజైలు కొడుతున్నారు. శశికిరణ్ టిక్కా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ముంబై బాంబు దాడుల్లో అమర వీరుడైన సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందింది. ఇక ఈ చిత్రం మొదటి రోజు రూ.13.4 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి అడివిశేష్ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికే ఈ చిత్రాన్ని వీక్షించిన పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కూడా మేజర్ చిత్రంపై ప్రశంసలు కురిపించాడు.
తాజాగా మేజర్ చిత్రాన్ని వీక్షించిన అల్లుఅర్జున్ ట్విట్టర్లో చిత్రబృందానికి అభినందనలు తెలిపాడు. ఈ చిత్రం ప్రతి భారతీయుడి గుండెను తాకుతుందని, అడివిశేష్ తన నటనతో మరోసారి మ్యాజిక్ చేశాడని తెలిపాడు. అంతేకాకుండా ప్రకాష్‌రాజ్, రేవతి, శోభితా ధూళిపాల సహా ఇతర ఆర్టిస్టులు వారి పాత్రలకు న్యాయం చేశారని, శ్రీ చరణ్ పాకాల సంగీతం అద్భుతంగా ఉందని తెలిపాడు. శశికిరణ్ టిక్కా పనితనం బ్యూటిఫుల్‌గా ఉందని, సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడని ప్రశంసలు కురిపించాడు. ప్రేక్షకుల హృదయాలను తాకే ఇంత గొప్ప సినిమాను నిర్మించినందుకు ప్రొడ్యూసర్ మహేష్‌బాబు గారును గౌరవంగా అభినందిస్తున్నట్లు ట్విట్టర్లో తెలిపాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
బయోగ్రాఫికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో అడివిశేష్‌కు జోడీగా సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. శోభితా ధూళిపాల కీలకపాత్రలో నటించింది. ఈ చిత్రాన్ని జీఎంబీ ఎంటర్టైనమెంట్స్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ+ఏయస్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
Big congratulations to the entire team of #MajorTheFilm. A very heart touching film . Man of the show @AdiviSesh does his magic once again. Impactful support by @prakashraaj ji , Revathi , @saieemmanjrekar, #SobhitaDhulipala & all artists . Mind blowing Bsm by @SricharanPakala
— Allu Arjun (@alluarjun) June 4, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

