సోలో హీరోగానే నటిస్తా
హుషారు, రౌడీబాయ్స్ చిత్రాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు యువ హీరో తేజ్ కూరపాటి. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా’. వెంకట్ వందెల దర్శకుడు. ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వర రావు నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్బంగా తేజ్ కూరపాటి మాట్లాడుతూ ‘నేను సోలో హీరోగా నటిస్తున్న తొలి చిత్రమిది. గ్రామీణ నేపథ్యంలో నడిచే ప్రేమకథగా ఆకట్టుకుంటుంది. ఓ ప్రేమజంట తమకు ఎదురైన కష్టాల్ని ఎలా అధిగమించారన్నది ఆసక్తిగా అనిపిస్తుంది. వినోదానికి పెద్దపీట వేశాం. కథానుగుణంగా మంచి పాటలు కుదిరాయి. ఇటీవల విడుదలైన ‘పుడమిని తడిపే తొలకరి మెరుపుల చినుకమ్మా’ పాటకు మంచి స్పందన లభిస్తున్నది. ఈ తరహా విలేజ్ లవ్‌స్టోరీ వచ్చి చాలా కాలమైంది. ఇక నుంచి సోలో హీరోగానే నటిద్దానుకుంటున్నా. నా తదుపరి చిత్రం ‘షికారు’ జూన్ 24 విడుదలకానుంది. మరో రెండు చిత్రాల్ని అంగీకరించా’అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Tej Kurapati
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

