Ghoomer Movie | అభిషేక్ బచ్చన్ గూమర్ ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్
Ghoomer Movie First Look | ఇండియాలోని ఫినెస్ట్ దర్శకులలో ఆర్. బాల్కి ఒకరు. ఆయన సినిమాలు కమర్షియల్‌గా పెద్దగా ఆడవు కానీ.. కంటెంట్ వైజ్‌గా బ్లాక్ బస్టర్ బొమ్మలే. తీసింది ఆరు సినిమాలే. కానీ ప్రతీ సినిమా ఓ ఆణిముత్యమే.
Ghoomer Movie First Look | ఇండియాలోని ఫినెస్ట్ దర్శకులలో ఆర్. బాల్కి ఒకరు. ఆయన సినిమాలు కమర్షియల్‌గా పెద్దగా ఆడవు కానీ.. కంటెంట్ వైజ్‌గా బ్లాక్ బస్టర్ బొమ్మలే. తీసింది ఆరు సినిమాలే. కానీ ప్రతీ సినిమా ఓ ఆణిముత్యమే. ప్రస్తుతం ఆయన గూమర్ అనే సినిమా చేస్తున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. దివ్యాంగురాలైన ఓ క్రీడాకారిణిని విజయవంతమైన క్రికెటర్‌గా మార్చే కోచ్ పాత్రలో అభిషేక్ బచ్చన్ కనిపించనున్నాడు. క్రీడాకారిణిగా సయామి ఖేర్ నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్యాచ్ వర్క్ పూర్తి చేసుకుంటుంది.
తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఒక చేయి లేకుండా ఉన్న సయామి ఖేర్ పోస్టర్‌ను, కోచ్ లుక్‌లో ఉన్న అభిషేక్ బచ్చన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అంతేకాకుండా అంతేకాకుండా మరో మూడు రోజుల్లో ట్రైలర్ కూడా రానుందని వెల్లడించారు. హోప్ ఫిల్మ్ మేకర్స్, సరస్వతి ఎంటర్టైనమెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. జీవితం అనేది లాజిక్‌తో ఆడే ఆట కాదు.. మేజిక్‌తో ఆడే ఆట అంటూ అభిషేక్ బచ్చన్ ఇన్‌స్టాలో పోస్టర్‌ను పంచుకున్నాడు. ఈ సినిమా ఆగస్టు 18న ప్రేక్షకులు ముందుకు రానుంది.
Life, logic ka khel nahi…magic ka khel hai#GhoomerInCinemas on 18th August!#RBalki @AzmiShabana @SaiyamiKher @Imangadbedi #AnirudhSharma @vishalsinha_dop @ItsAmitTrivedi #RahulSengupta @swanandkirkire @hopeprodn #PremVijan #PenMarudhar pic.twitter.com/y6F9sul5zn
— Abhishek 𝐁𝐚𝐜𝐡𝐜𝐡𝐚𝐧 (@juniorbachchan) July 31, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

