Masth Shades Unnai Ra | ఓటీటీలోకి అభినవ్ గోమఠం ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’… స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
Abhinav Gomatam | టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ అభినవ్ గోమఠం (Abhinav Gomatam) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మళ్లీరావా చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ‘ఈ నగరానికి ఏమైంది’, ‘మీకు మాత్రమే చెప్తా’, ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
Abhinav Gomatam | టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ అభినవ్ గోమఠం (Abhinav Gomatam) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మళ్లీరావా చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ‘ఈ నగరానికి ఏమైంది’, ‘మీకు మాత్రమే చెప్తా’, ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమాలు ఇచ్చిన జోష్‌తో ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. అయితే అభినవ్ గోమఠం తాజాగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా..!'(Masth Shades Unnai Ra) ఈ సినిమాకు తిరుపతి రావు దర్శకత్వం వహించగా.. వైశాలి రాజ్, లావణ్య రెడ్డి కథనాయికలుగా నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదలై మంచి విజయం అందుకుంది. అయితే ఈ సినిమా తాజాగా ఓటీటీ లాక్ చేసుకుంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా మార్చి 29 (శుక్రవారం) నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. గోదావరి ప్రాంతంలో ఉన్న ఒక చిన్న పలెటూళ్లో మనోహర్ (అభినవ్ గోమఠం) అనే వ్యక్తి గొప్ప పెయింటర్ అవ్వాలని.. అలాగే తన ఊరిలోనే దానిపై మంచి బిజినెస్ పెట్టి లైఫ్ లో సెటిల్ అవుదామని కలలు గంటూ ఉంటాడు. ఈ క్రమంలో పరిచయమైన ఉమాదేవి తన కి ఎలా సహాయపడింది. మధ్యలో వీళ్ళ లవ్ ట్రాక్ ఏంటి? అసలు మనోహర్‌కు తాను కలలు గన్న జీవితం దొరుకుతుందా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. కాసుల క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై వంశీ నందిపాటి సమర్పణలో ఆరేం రెడ్డి, ప్రశాంత్, భవాని కాసుల ఈ సినిమాను నిర్మించారు.
#MasthuShadesUnnaiRa! 🎨 Streaming on Prime starting March 29th. #MSURonPrimeMar29 pic.twitter.com/yvp9rZU2Oz
— ganesh dhoni talkies (@GDTalkies) March 27, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

