Abhinav Gomatam | టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ అభినవ్ గోమఠం (Abhinav Gomatam) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మళ్లీరావా చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ‘ఈ నగరానికి ఏమైంది’, ‘మీకు మాత్రమే చెప్తా’, ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమాలు ఇచ్చిన జోష్‌తో ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. అయితే అభినవ్ గోమఠం తాజాగా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా.!. ఈ సినిమాకు తిరుపతి రావు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోగా పోస్ట ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ను ఇచ్చారు మేకర్స్.
ఈ మూవీ నుంచి ఫస్ట్ షేడ్(ఫస్ట్ లుక్‌ని) ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కాసుల క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై వంశీ నందిపాటి సమర్పణలో ఆరేం రెడ్డి, ప్రశాంత్, భవాని కాసుల నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రచన & దర్శకత్వం: తిరుపతి రావు. నిర్మాతలు: ఆరెం రెడ్డి, ప్రశాంత్ వి, భవానీ కాసుల. SIC: సంజీవ్ట్ BGM: శామ్యూల్ ABY DOP: సిద్దార్థ స్వయంభూ ఎడిటర్: రవితేజ గిరిజాల. డైలాగ్స్: రాధా మోహన్ గుంటి ప్రొడక్షన్ డిజైనర్: శరవణన్ వసంత్. సాహిత్యం: కిట్టు విస్సప్రగడ. గాయకులు: SID శ్రీరామ్, హేమచంద్ర