అభయ్, అర్పిత లోహి ప్రధాన పాత్రల్లో నటించిన వీడియో ఆల్బమ్ ‘ఊహలో తేలాల’. ధనుంజయ్ అధ్వర్యంలో అభయ్ ప్రొడక్షన్స్‌లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందించారు. ఫణి గణేష్ దర్శకుడు.
ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. సంగీత దర్శకులు కోటి, ఆర్పీ పట్నాయక్ అతిథులుగా హాజరయ్యారు. కుటుంబ భావోద్వేగాలతో మనసుకు హత్తుకునే పాట ఇదని దర్శకుడు ఫణి గణేష్ పేర్కొన్నారు.
x