అమ్మలాలో రామ్ భజన..
గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆయ్'. నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి అంజి కె.మణిపుత్ర దర్శకుడు.
గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆయ్’. నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి అంజి కె.మణిపుత్ర దర్శకుడు. జీఏ2 పిక్చర్స్ పతాకంపై, అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాస్, విద్యా కొప్పినీడి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం స్వాతంత్య్రదినోత్సవ కానుకగా ఆగస్ట్ 15న విడుదల కానుంది. ఇప్పటివరకూ విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి అద్భుతమైన స్పందన వస్తున్నదని చిత్రబృందం ఆనందం వెలిబుచ్చింది.
తాజాగా ఈ సినిమా నుంచి ఓ వెరైటీ పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘పేరు లేదు ఊరు లేదు ప్రేమించేసిందండోయ్.. అహా.. అమ్మలాలో రామ్ భజన.. మాట లేదు.. మనువు లేదు.. మనసిచ్చేసిందండోయ్.. అమ్మలాలో రామ్ భజన..’ అంటూ పద్మావతీ, వేంకటేశ్వరస్వామిల ప్రేమను తెలుపుతూ బుర్రకథ పంథాలో సాగే ఈ పాటను దర్శకుడు అంజి కె.మణిపుత్ర రాయగా, అజయ్ అరసాడ స్వరపరిచారు. పెంచల్దాస్ ఆలపించారు. తెలుగు సంప్రదాయానికీ, సంస్కృతికీ అద్దంపట్టేలా ఈ పాట చిత్రీకరించామని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్ కల్యాణి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

