AAY | ‘ఆయ్’ అంటూ వస్తున్న ఎన్టీఆర్ బామ్మర్ది.. ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ సింగిల్ ప్రోమో
Narne Nithiin | గతేడాది ‘మ్యాడ్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్. ఈ చిత్రం ఇచ్చిన జోష్‌తో ప్రస్తుత వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. అయితే నార్నే నితిన్ హీరోగా రూపొందుతున్న సినిమాల్లో ఒకటి ‘ఆయ్’.
Narne Nithiin | గతేడాది ‘మ్యాడ్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్. ఈ చిత్రం ఇచ్చిన జోష్‌తో ప్రస్తుత వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. అయితే నార్నే నితిన్ హీరోగా రూపొందుతున్న సినిమాల్లో ఒకటి ‘ఆయ్’(AAY). కోనసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు అంజి కంచిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ రీసెంట్ కంప్లీట్ చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలావుంటే తాజాగా మూవీ నుంచి మ్యూజికల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ సుఫియానా అని సాగే పాట ప్రోమోను చిత్రయూనిట్ విడుదల చేశారు. దీనికి సంబంధించి ఫుల్ పాటను మార్చి 20న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇక ఈ సినిమాలో రాజ్‌కుమార్ కసిరెడ్డి, అంకిత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతోన్న ఈ సినిమాను సమ్మర్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి రామ్ మిర్యాల సంగీతం అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

