యువ నటుడు ఆర్య హీరోగా రూపొందుతున్న స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘రంజీ’. పోలూరు కృష్ణ దర్శకుడు. మురుకుంట్ల అరవింద్, విజయభారతి నిర్మాతలు. ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్నది. శుక్రవారం హీరో ఆర్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌తోపాటు ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.
ఇంటెన్స్, పవర్ఫుల్ ప్రెజెన్స్‌తో కనిపిస్తున్న ఆర్యను ఈ పోస్టర్లో చూడొచ్చు. ఈ పాత్ర ఎంత ప్రభావవంతంగా ఉండబోతుందో ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ చెబుతున్నది. వ్రంజనా పాండ్య కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో దశరథ్, వాసుకి, ఆడుకాలం నరేన్, సమ్మెట గాంధీ కీలక పాత్రదారులు. ఈ చిత్రానికి కెమెరా: రామ్ కె.మహేశ్, సంగీతం: రధన్, సమర్పణ: ఆకృతి నంద.