Highway Movie | ఆసక్తి రేకెత్తిస్తున్న ఆనంద్ దేవరకొండ ‘హైవే’ టీజర్
Highway Movie Teaser | ‘దొరసాని’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ. మొదటి సినిమాతోనే డిజాస్టర్‌ను సాధించి ప్రేక్షకుల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత గతేడాది ఓటీటీలో నేరుగా విడుదలైన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’తో మంచి ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘హైవే’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘118’, ‘WWW’ వంటి వినూత్న చిత్రాలను తెరకెక్కించిన కే.వి గుహన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 19 నుండి నేరుగా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.
లేటస్ట్‌గా విడుదలైన టీజర్ ఆధ్యాంతం ఆసక్తి రేకెత్తిస్తుంది. ‘5 హత్యలు, ఎలాంటి అధారాలు లేవు. ఆ అమ్మాయిలపై వాళ్ళకు ఎందుకుంత కోపం’ అంటూ వచ్చే డైలాగ్ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీ పెరుగుతుంది. సిమోన్ కింగ్ నేపథ్య సంగీతం థ్రిల్ ఫీల్‌ను కలిగిస్తుంది. కెమెరా విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో సత్య, అభిషేక్ బెనర్జీ, సైయామీ ఖేర్ కీలకపాత్రల్లో నటించారు. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై వెంకట్ తలారి ఈ చిత్రాన్ని నిర్మించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

