Amir Khan | అది నా కెరీర్‌కు టర్నింగ్ పాయింట్.. మహేశ్ భట్‌తో సినిమాకు నో చెప్పడంపై అమీర్ ఖాన్
ఏడాదిన్నర పాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్టు అమీర్ ప్రకటించాడు
Amir Khan : బాలీవుడ్‌లోని టాలెంటెడ్ యాక్టర్స్‌లో ఒకడైన అమీర్ ఖాన్ కొన్నిరోజులు విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన తాజాగా తన కెరీర్ గురించి హ్యూమన్స్ ఆఫ్ బాంబే ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఈ సందర్భంగా డైరెక్టర్ మహేశ్ భట్‌తో సినిమా చేయకపోవడం తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు కథ నచ్చకున్నా, డైరెక్టర్, నిర్మాత నచ్చకున్నా కూడా సినిమా చేయొద్దని కెరీర్ మొదట్లోనే నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నాడు. ‘మహేశ్ భట్ చెప్పిన కథ నాకు అంతగా నచ్చలేదు. దాంతో మొహమాట పడకుండా వెంటనే నో చెప్పేశాను. ఆ తర్వాత కథ ఎందుకు నచ్చలేదో మహేశ్‌కు వివరించాను’ అని అమీర్ వెల్లడించాడు.
అమీర్ ఖాన్ కెరీర్ కష్టమైన దశలో ఉన్నప్పుడు మహేశ్ భట్ నుంచి సినిమా ఆఫర్ వచ్చింది. అప్పట్లో మహేశ్ భట్ విజయవంతమైన డైరెక్టర్. అతని నుంచి ఆఫర్ రావడమే అదృష్టం అనుకునేవాళ్లు. అందుకని అమీర్ కథ వినేందుకు మహేశ్ ఇంటికి వెళ్లాడు. కానీ, ఆ కథ నచ్చలేదు. దాంతో ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాడు.
అమీర్ ఖాన్, కరీనా కపూర్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా ఫ్లాప్ అయింది. దాంతో, ఏడాదిన్నర పాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్టు అమీర్ ఈమధ్యే ప్రకటించాడు. కుటుంబంతో గడిపేందుకు సమయం కేటాయిస్తానని చెప్పాడు. రెండు రోజుల క్రితం ఖతర్‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో ఒక స్టేడియం బయట అమీర్ ఖాన్ అభిమానులతో ఫొటోలు దిగుతూ సందడి చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో అతని మాజీ భార్య కిరణ్ రావు, కొడుకు ఉన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

