Aamir Khan | మొదటి భార్యతో విడాకులు.. మందుకు బానిసై దేవదాస్‌లా మారా : ఆమిర్ ఖాన్
Reena Dutta | బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఇటీవల వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన వ్యక్తిగత జీవితంలోని కొన్ని బాధాకరమైన అనుభవాలను పంచుకున్నారు.
Aamir Khan | బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ (Aamir Khan) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ నటుడిగా రాణించిన ఈ నటుడు ప్రస్తుతం సినిమాలకు చాలా గ్యాప్ తీసుకున్నాడు. చాలా రోజుల తర్వాత ఆయన సితారే జమీన్ పర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. అయితే రీసెంట్గా తన 60వ పుట్టినరోజును జరుపుకున్న ఈ హీరో మొదటి భార్య రీనా దత్తాతో విడాకులు గురించి స్పందించాడు. రీనాను తాను ఎంతగానో ప్రేమించానని.. కానీ అనుకోకుండా మేమిద్దరం విడిపోయామని ఈ విడాకులు తనను తీవ్రంగా కుంగదీసినట్లు, దాని కారణంగా మద్యానికి బానిస అయినట్లు అమీర్ తెలిపారు.
రీనాతో విడిపోయిన సమయంలో నేను చాలా బాధపడ్డాను. సుమారు మూడేళ్లపాటు ఒక్కడినే ఒంటరిగా గడిపాను. షూటింగ్‌లకు దూరంగా పనిపై దృష్టి పెట్టలేకపోయాను. స్క్రిప్ట్‌లు కూడా వినలేదు. ఇంట్లో ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉండేవాడిని. నిద్ర కూడా పట్టేది కాదు. ఏం చేయాలో అర్థం కాక, ప్రశాంతంగా నిద్రపోవడం కోసం మద్యం తాగడం మొదలుపెట్టాను. ఆల్కహాల్ గురించి ఏమీ తెలియని నేను ఒక్కసారిగా రోజుకో బాటిల్ తాగే స్థాయికి చేరాను. ఏడాదిన్నర పాటు మద్యానికి బానిస అయ్యాను. ఒక విధంగా చెప్పాలంటే దేవదాస్‌లా మారిపోయాను. తీవ్రమైన మానసిక కుంగుబాటులోకి వెళ్లాను. ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి సినిమాను ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టాను. అదే నా జీవితాన్ని మార్చింది. సినిమా పట్ల నాకున్న ప్రేమ నా వ్యసనాలకు చెక్ పెట్టేలా చేసింది. అయితే ఇష్టపడిన వారు పక్కన లేకుండానే జీవితాన్ని కొనసాగించాలని తెలుసుకున్నానంటూ ఆమిర్ చెప్పుకోచ్చాడు.
1986లో ఆమిర్ ఖాన్, రీనా దత్తా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఐరా ఖాన్, జునైద్ ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 16 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత, 2002లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అనంతరం ఆమిర్ 2005లో కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఆజాద్ రావు ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. కానీ, 2021లో ఆమిర్ కిరణ్ కూడా విడిపోయారు. ప్రస్తుతం ఆమిర్ ఖాన్ గౌరీ అనే స్నేహితురాలితో రిలేషన్లో ఉన్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

