Aakhri Sawal | బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఆఖ్రీ సవాల్’ (Aakhri Sawal) మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ అభిజీత్ మోహన్ వారంగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, భారతదేశ చరిత్రలోని వివాదాస్పదా అంశాలపై రాబోతున్నట్లు తెలుస్తుంది.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. మహాత్మా గాంధీ హత్య వెనుక ఆరోపణలు, బాబ్రీ మసీదు కూల్చివేత, మరియు దేశంలో విధించిన ఎమర్జెన్సీ వంటి కీలక చారిత్రక ఘట్టాలను ఈ సినిమాలో ప్రశ్నించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ప్రొఫెసర్ గోపాల్ నడ్కర్ణిగా సంజయ్ దత్ చాలా గంభీరమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో అమిత్ సాధ్, సమీరా రెడ్డి, నీతూ చంద్ర మరియు త్రిధా చౌదరి కీలక పాత్రల్లో నటించారు. చాలా కాలం తర్వాత సమీరా రెడ్డి ఈ సినిమాతో వెండితెరకు రీ-ఎంట్రీ ఇస్తుండటం విశేషం. అంతేకాకుండా, ఈ సినిమా వినికిడి లోపం ఉన్న వారి కోసం ‘ఇండియన్ సైన్ లాంగ్వేజ్’ (ISL) సపోర్ట్‌తో విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఈ చిత్రం మే 15న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.