గౌతమ్‌కృష్ణ, పూజిత పొన్నాడ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆకాశ వీధుల్లో’. గౌతమ్‌కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మనోజ్ డి జె, డా॥ మణికంఠ నిర్మించారు. నేడు విడుదలకానుంది. మంగళవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. గౌతమ్‌కృష్ణ మాట్లాడుతూ ‘పక్కా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇది.
నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో కథను తయారుచేసుకున్నాం. ఓ సాధారణ యువకుడు రాక్‌స్టార్ ఎలా అయ్యాడన్నదే చిత్ర ఇతివృత్తం. నేటి యువతకు చక్కటి సందేశాన్నిస్తుంది’ అన్నారు. ట్రైలర్ చూస్తుంటే ‘అర్జున్ రెడ్డి’ గుర్తుకొచ్చిందని, ఆ సినిమా తరహాలోనే యువతకు కనెక్ట్ అయ్యే అంశాలున్నాయని ఆర్.పి.పట్నాయక్ తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘గౌతమ్‌కృష్ణ చక్కటి ప్రతిభావంతుడు. మెడిసిన్ పూర్తి చేసి సినిమాల్లోకి వచ్చాడు. అతని పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది’ అని చెప్పారు.