గౌతమ్ కృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘ఆకాశ వీధుల్లో’. ఈ చిత్రంలో పూజిత పొన్నాడ నాయికగా నటిస్తున్నది. జీకే ఫిలిం ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకాలపై మనోజ్ డీకే, డాక్టర్ మణికంఠ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం తుది హంగులు అద్దుకుంటున్నది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని దర్శక నిర్మాతలు ప్రకటించారు. సెప్టెంబర్ 2న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో దేవి ప్రసాద్, సత్యం రాజేశ్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : విశ్వనాథ్ రెడ్డి, సంగీతం : జూడా శాండీ.