Vaishnav Tej | నేను హీరోను కాదు.. నటుణ్ని మాత్రమే.. మెగా మేనల్లుడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Vaishnav Tej | “మాస్ హీరో అవుదామని లేదు. నాకు తెలిసిందల్లా కష్టపడి నిజాయితీగా పనిచేసుకుపోవడమే. కథ, పాత్ర నచ్చితే సినిమా చేస్తాను. ఫలితం గురించి ఆలోచించను. తొలి సినిమా ‘ఉప్పెన’ కూడా అలాగే చేశాను. ఎవరైనా అడిగినా నేను హీరోను కాదు, నటుడ్ని మాత్రమే అని చెబుతాను.
Vaishnav Tej | “మాస్ హీరో అవుదామని లేదు. నాకు తెలిసిందల్లా కష్టపడి నిజాయితీగా పనిచేసుకుపోవడమే. కథ, పాత్ర నచ్చితే సినిమా చేస్తాను. ఫలితం గురించి ఆలోచించను. తొలి సినిమా ‘ఉప్పెన’ కూడా అలాగే చేశాను. ఎవరైనా అడిగినా నేను హీరోను కాదు, నటుడ్ని మాత్రమే అని చెబుతాను. ‘హీరో అనిపించుకుంటే మంచి పాత్రలు చేయలేం. నటుడు అనిపించుకో.. విభిన్నపాత్రలు చేసే అవకాశం వస్తుంది’ అని పవన్‌కల్యాణ్ చెప్పారు. ఆయన మాటే నాకు వేదవాక్కు ’ అని పంజా వైష్ణవ్ తేజ్ అన్నారు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదికేశవ’. శ్రీలీల కథానాయిక. శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు వైష్ణవ్ తేజ్.
మాస్కథల్లో ఇదో కొత్త జానర్
‘రంగరంగ వైభవంగా’ చిత్రీకరణ సమయంలో ఈ కథ విన్నాను. చాలా బాగా నచ్చింది. తుదిమెరుగులు దిద్దాక ఇంకా బాగా వచ్చింది. ఇది మాస్ సినిమా అయినప్పటికీ కథలో కొత్తదనం ఉంటుంది. ఇందులో కామెడీ, సాంగ్స్, విజువల్స్, ఫైట్స్ అన్నీ బాగుంటాయి. యాక్షన్ సన్నివేశాలు కథలో భాగంగానే ఉంటాయి. వాటిని దర్శకుడు సాధ్యమైనంత సహజంగా చిత్రీకరించాడు. కొడితే పదిమంది గాల్లో ఎగిరిపడటం లాంటివి ఇందులో ఉండవు. అన్నీ నాచురల్‌గా ఉంటాయి
రాధికగారితో నటించడం మరపురాని అనుభూతి
శ్రీలీలతో డ్యాన్స్ అంటే మాటలు కాదు. నేను స్వతహాగా డ్యాన్సర్‌ని కాదు. పట్టుదల మాత్రం ఎక్కువ. మీరు ఓకే అనేదాకా ఎంతైనా కష్టపడతాను అని మాస్టర్‌కి చెప్పాను. కానీ ఎంత కష్టమైనా మూమెంట్ అయినా రెండో టేక్‌లోనే ఓకే అయిపోయేది. శ్రీలీల కూడా బాగా కోపరేట్ చేసింది. మా ఇద్దరి మధ్య సన్నివేశాలు కూడా క్యూట్‌గా, సరదాగా, సహజంగా ఉంటాయి. శ్రీలీల పాత్రలోని అమాయకత్వం, తింగరితనంలోనుంచి దర్శకుడు శ్రీకాంత్ హాస్యం రాబట్టాడు. అలాగే సీనియర్ నటి రాధికగారితో కలిసి నటించడం మరపురాని అనుభూతి. జీవీ ప్రకాశ్కుమార్గారి పాటలు నేపథ్యం సంగీతం రెండూ అద్భుతంగా ఉంటాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

