కథ వినకుండానే అంగీకరించా!
కెరీర్ ఆరంభం నుంచి వినూత్న కథా చిత్రాల్లో నటిస్తూ ప్రతిభావంతుడైన నటుడిగా గుర్తింపును తెచ్చుకున్నారు ఆది పినిశెట్టి. అగ్ర నటుడు బాలకృష్ణ ‘అఖండ-2’ చిత్రంలో ఆయన ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.
కెరీర్ ఆరంభం నుంచి వినూత్న కథా చిత్రాల్లో నటిస్తూ ప్రతిభావంతుడైన నటుడిగా గుర్తింపును తెచ్చుకున్నారు ఆది పినిశెట్టి. అగ్ర నటుడు బాలకృష్ణ ‘అఖండ-2’ చిత్రంలో ఆయన ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 14రీల్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శనివారం ఆది పినిశెట్టి విలేకరులతో సినిమా విశేషాలను పంచుకున్నారు.
- బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘సరైనోడు’ చిత్రంలో వైరం ధనుష్ అనే పాత్రను పోషించాను. అయితే ‘అఖండ-2’లో పాత్ర మాత్రం పూర్తిగా విభిన్నమైనది. మంత్రతంత్రాల చుట్టూ తిరిగే పాత్రలను నేనింతవరకూ చేయలేదు. నా కెరీర్లో ఇదొక ప్రయోగాత్మక పాత్ర అనుకోవచ్చు.
- బోయపాటి మీద నమ్మకంతో కథ వినకుండానే ఈ సినిమాకు ఓకే చెప్పాను. అయితే బాలకృష్ణ ఎదురుగా నేను సరిపోతానా? అనే సందేహం ఉండేది. ఇదే విషయాన్ని బోయపాటి వద్ద ప్రస్తావిస్తే ‘నువ్వు ఈ పాత్రకు పర్ఫెక్ట్గా సెట్ అవుతావు’ అని ధైర్యాన్నిచ్చారు. ఈ పాత్ర కోసం బోయపాటి చాలా రెఫరెన్స్‌లు ఇచ్చారు. వాటి ప్రకారం నా పాత్రలో పర్ఫెక్షన్ చూపించే ప్రయత్నం చేశా.
- బాలకృష్ణతో పనిచేయడం గొప్ప అనుభవం. ఆయన ఉంటే సెట్లో పాజిటివ్ వైబ్స్ కనిపిస్తాయి. ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడం ఎవరికైనా చాలా కష్టం. బాలకృష్ణ మా నాన్నతో సినిమాలు చేశారు. సెట్లో అప్పటి అనుభవాలను కూడా నాతో పంచుకునేవారు. బాలయ్య ముక్కుసూటి మనిషి అని మా నాన్న చెబుతుండేవారు. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు మరోలా మాట్లాడే మనస్తత్వం కాదు ఆయనది.
- ప్రస్తుతం ‘థండర్’ అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నా. తెలుగు, తమిళంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘మరకతమణి’ సీక్వెల్ చేస్తున్నా. అలాగే కార్తీతో కలిసి ‘మార్షల్’ మూవీలో నటిస్తున్నా. మరికొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

