Aadhi pinisetty | ‘ది వారియర్’ నుంచి పోస్టర్ విడుదల.. ఆకట్టుకుంటున్న ఆది పినిశెట్టి లుక్
Aadhi pinishetti | నటన ప్రాధాన్యమున్న కథలను ఎంచుకుంటూ అటు హీరోగా, ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీరంగంలో దూసుకుపోతున్న నటుడు ఆది పినిశెట్టి. ప్రముఖ దిగ్గజ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చిన తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు.
Aadhi pinisetty | నటన ప్రాధాన్యమున్న కథలను ఎంచుకుంటూ అటు హీరోగా, ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీరంగంలో దూసుకుపోతున్న నటుడు ఆది పినిశెట్టి. ప్రముఖ దిగ్గజ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చిన తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం ఈయన రామ్పోతినేని హీరోగా నటిస్తున్న ‘ది వారియర్’ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రంలోని ఆది పినిశెట్టి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
‘ది వారియర్’ చిత్రంలో ఆది గురు పాత్రలో నటించనున్నాడు. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్లో ఆది గడ్డంతో రగ్గుడ్ లుక్‌లో క్రూరంగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆర్జే విజిల్ పాత్రలో కృతి శెట్టి నటిస్తుంది. ఇదివరకే విడుదలైన కృతిశెట్టి ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు విశేష స్పందన లభించింది. రామ్ ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. తెలుగు,తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం తెరకెక్కతుంది.
ఆది పినిశెట్టి ఇదివరకే ‘సరైనోడు’ సినిమాలో విలన్‌గా ఫుల్ లెంగ్త్ రోల్ పోషించిన విషయం తెలిసిందే. స్టైలిష్ విలన్‌గా ఆది పండించిన విలనిజంకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మళ్లీ ఇప్పటి వరకు ఆది పినిశెట్టి విలన్ పాత్ర చేయలేడు. లింగుస్వామి చెప్పిన పాత్ర నచ్చడంతో ‘ది వారియర్’ చిత్రంలో నటించడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నాడు.
G•U•R•U! pic.twitter.com/G6p0yzHLmZ
— Aadhi🎭 (@AadhiOfficial) March 1, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

